Business Ideas: ఈ వ్యాపారం కోసం షాపు అవసరం లేదు, కేవలం రూ. 50 వేలు ఉంటే చాలు, నెలకు లక్షల్లో ఆదాయం..

Published : Dec 05, 2022, 10:06 AM IST

వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా, అయితే వినూత్నంగా ఆలోచిస్తే, అనేక మార్గాలు మీ ముందున్నాయి. ప్రస్తుతం దేశంలో కార్ల యజమానుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మీరు కూడా కారుకు సంబంధించిన ఓ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ప్రతి నెల లక్షల్లో ఆదాయం లభించే అవకాశం ఉంది. 

PREV
15
Business Ideas: ఈ వ్యాపారం కోసం షాపు అవసరం లేదు, కేవలం రూ. 50 వేలు ఉంటే చాలు, నెలకు లక్షల్లో ఆదాయం..

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు పెద్దఎత్తున అనేక పథకాలను ప్రారంభిస్తోంది.  అందులో ప్రధానమైనది ముద్ర యోజన.  నిరుద్యోగ యువత ప్రభుత్వ బ్యాంకుల నుంచి అత్యంత సులువైన పద్ధతిలో  రుణం తీసుకుని, వ్యాపారం చేసి తమ సొంత కాళ్లపై నిలబడుతున్నారు. ముద్ర రుణం కింద రూ 50 వేల నుంచి గరిష్టం  పది లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. మీరు కూడా సొంత కాళ్లపై నిలబడి వ్యాపారం చేయాలి అనుకుంటే ముద్ర రుణాలను పొందవచ్చు.
 

25

 మీరు వ్యాపారం చేయాలని దృఢంగా అనుకుంటే మాత్రం,  అనేక వ్యాపార మార్గాలు ఉన్నాయి.  అందులో ఒకటి కార్ క్లీనింగ్ సర్వీస్.  ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కారు కొనుగోలు చేస్తున్నారు. కారు కొనుగోలు చేసినప్పుడు దాని క్లీనింగ్ కూడా అత్యంత ముఖ్యం. క్లీనింగ్ లేకపోతే ఎంత కొత్త కారు అయినా దుమ్ము పట్టి కనిపిస్తోంది.  అందుకే క్లీనింగ్ అత్యంత ముఖ్యమైనది.  ఈ కార్ క్లీనింగ్ సర్వీస్ ని మీరు ఉపాధి మార్గం గా మార్చుకోవచ్చు. ఇదిలా ఉంటే కార్ క్లీనింగ్ సర్వీస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.  ఒక పెద్ద గ్యారేజీలో క్లీనింగ్ సర్వీస్.  కానీ హోమ్ సర్వీస్ ద్వారా కూడా చేయవచ్చు.  మీరే స్వయంగా కస్టమర్ ఇంటికి వెళ్లి క్లీనింగ్ చేయడం ద్వారా ఎక్కువ ఆర్డర్లను పొందే అవకాశం ఉంది.  అలాగే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది. 

35

ఈ కార్ క్లీనింగ్ సర్వీసు కోసం మీకు కావాల్సింది High-Pressure Washer for Car అవసరం అవుతుంది. కారు క్లీనింగ్ కోసం Bosch వంటి కంపెనీలు కూడా హై ప్రెజర్ వాషర్ లను అందుబాటులో ఉంచాయి. వీటి ధర సుమారుగా రూ. 10,000 నుంచి ప్రారంభం అవుతుంది. ఇండియా మార్ట్ అలాంటి వెబ్ సైట్ లలో అనేక కంపెనీల కార్ వాషర్ అందుబాటులో ఉన్నాయి వాటి ధరలను మీరు బేరీజు వేసుకో వచ్చు. 

45

Car Foam Wash Machine కూడా అందుబాటులో ఉన్నాయి.  వీటి ధరలు కూడా సుమారుగా రూ.10 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఉన్నాయి. వీటి  సామర్థ్యాన్ని బట్టి ఫోం మిషన్స్ అందుబాటులో ఉంటాయి.  ఇక  హోమ్ కార్ క్లీనింగ్ సర్వీస్ కోసం,  మీరు క్లయింట్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.  అందుకోసం మెషీన్లను  ఒక మారుతి వ్యానులో పెట్టుకొని వెళితే సరిపోతుంది. తద్వారా మీకు చాలా ఖర్చు కలిసి వస్తుంది. షాపు మెయిన్ టెయిన్ చేయాల్సిన పనిలేదు. 

55

ఇక పబ్లిసిటీ కోసం మీరు న్యూస్ పేపర్, ఎలక్ట్రానిక్ మీడియా, పాంప్లెట్స్, సోషల్ మీడియా వేదికగా చేసుకోవచ్చు. తద్వారా మీరు చక్కటి ప్రచారం పొందే వీలుంది. ఇక మీరు పెట్టుబడి కోసం ముద్ర రుణం పొందవచ్చు. అలాగే ఈ సర్వీసు కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది. తద్వారా మీకు పెద్ద మొత్తంలో కార్పోరేట్ ఆర్డర్లు కూడా పొందే అవకాశం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories