Business Ideas: ఉద్యోగం చేసి బోర్ కొట్టిందా, కేవలం రూ. 2.50 లక్షల పెట్టుబడితో, నెలకు రూ. 1 లక్ష సంపాదన..

First Published Dec 2, 2022, 4:45 PM IST

కరోనా తర్వాత చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించి తమ ఖర్చులను  మిగిల్చుకున్నాయి.  అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది యువతరం,  ఉద్యోగం కన్నా సొంత వ్యాపారం పైనే  ఆధారపడితే,  భవిష్యత్తులో సొంత కాళ్లపై నిలబడవచ్చని  పెద్ద సంఖ్యలో భావించారు.  మీరు కూడా అలాంటి ఆలోచన చేస్తున్నట్లు అయితే, ప్రస్తుతం ఇక్కడ  తెలిపే బిజినెస్ ఐడియా మీకు ఉపయోగపడవచ్చు. 
 

ఫుడ్ బిజినెస్ ఎప్పటికీ డిమాండ్ ఉన్న బిజినెస్,  మనిషికి ఆహారం నిత్యవసరం,  ఎవరు ఎంత కష్టపడి నప్పటికీ,  చివరకు ఆహారం కోసమే ఖర్చు పెట్టాలి.  అందుకే ఈ బిజినెస్ లో సీజన్తో సంబంధం లేకుండా ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.  మీరు కూడా ఈ బిజినెస్ లో రాణించాలి అనుకుంటే,  చికెన్ సెంటర్ అత్యుత్తమమైనది.  చికెన్ సెంటర్ అనగానే చాలా మందికి చిన్నచూపు ఉంది. నిజానికి ఇందులో చక్కటి ఆదాయం లభిస్తుంది.  నేటికాలంలో చదువుకున్న వారు సైతం చాలామంది,  చికెన్ షాప్ పెట్టుకుని మంచి జీవితం గడుపుతున్నారు.  అయితే చికెన్ ఎలా  స్టార్ట్ చేయాలి,  పెట్టుబడి ఎంత అవుతుంది,  ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. 
 

నేటి కాలంలో చికెన్ షాప్ లు అన్నీ కూడా  ఫ్రాంచైజీ  మోడల్ లోనే నడుస్తున్నాయి.  ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్ లోని అనేక పౌల్ట్రీ దిగ్గజ కంపెనీలు  తమ ఫ్రాంచైజీల ద్వారా విస్తరిస్తున్నాయి.  మీరు కూడా ఈ ఫ్రాంచైజీ మోడల్ ద్వారానే,  చికెన్ షాప్ పెట్టుకోవాలి అనుకుంటే,  చక్కటి అవకాశం ఉందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోని సుగుణ, వెంకీస్, స్నేహ చికెన్ లాంటి దిగ్గజ కంపెనీలు తమ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నాయి. అయితే మీరు వీరిని సంప్రదించి బ్రోచర్ పొందడం ద్వారా ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసుకోవచ్చు. 
 

సాధారణంగా ప్రాంచైజీ ఏర్పాటు కోసం కనీసం 2.50 లక్షలు ఖర్చు అవుతుంది. కనీసం 200 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ కావాలి. అలాగే ఫ్రాంచైజీలో భాగంగా మీకు వెయింగ్ మెషీన్, డ్రెస్సింగ్ మెషిన్ అందిస్తారు. అలాగే మీకు కనీసం ఇద్దరు పనివాళ్లు అవసరం అవుతారు. షాపును రెంట్ కింద తీసుకోవాలి. ఫ్రాంచైజీ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు షాపు పెట్టాలి అనుకునే ప్రాంతంలో కనీసం 1 కిలో మీటర్ పరిధిలో మీరు అప్లై చేస్తున్న సంస్థ ఫ్రాంచైజీ షాపు ఉండకూడదు. 
 

 ఇక షాపు ఏర్పాటు చేసుకున్న తర్వాత చికెన్ పై చక్కటి ఆదాయం లభిస్తుంది. బ్రాండెడ్ చికెన్ కావడం వల్ల మీకు పెద్దగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన పనిలేదు. కోడిపై మీకు మార్జిన్ ఆధారంగా లాభం వస్తుంది. ఫంక్షన్లు, కేటరింగ్ సంస్థలు, హాస్టళ్లు, హోటల్స్ తో మీరు ఒప్పందం కుదుర్చుకుంటే,మీకు మరింత ఆదాయం పెరుగుతుంది. ఆదివారం సేల్స్ చాలా బాగుంటాయి. అందుకే పనివాళ్లకు ఆదివారం ఎక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. చికెన్ కటింగ్ కోసం అనుభవం ఉన్న పనివాళ్లను కుదుర్చుకోవాలి. అప్పుడే మీ వ్యాపారం సాఫీగా నడుస్తోంది. చికెన్ షాపుపై ప్రతి నెల సగటున రూ. 1 లక్ష నుంచి 2 లక్షల వరకూ ఆదాయం లభిస్తుంది. ఖర్చులు పోనూ మీకు కనీసం రూ. 1 లక్ష వరకూ మిగిలే చాన్స్ ఉంది. 
 

click me!