JSW MG మోటార్ ఇండియా కంపెనీ MG కామెట్ కొన్ని కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అయింది. దీని వల్ల కామెట్ లో ఉన్న కొని వేరియంట్స్ ధరలు రూ.27,000 వరకు పెరిగాయి. మిడ్ స్పెక్ ఎక్సైట్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.20,000 వరకు ఎక్కువైంది. అయితే కామెట్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది మార్కెట్ లో ఇప్పుడు రూ.4.99 లక్షలకే లభిస్తోంది. దేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ వాహనం ఇదే కావడం విశేషం.
2025 MG కామెట్ కొత్త ఫీచర్లు
టాప్ స్పెక్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో 4 స్పీకర్లు ఉంటాయి. ఇంతకుముందు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌కు మాత్రమే ఉన్న రియర్ పార్కింగ్ కెమెరా, సైడ్ మిర్రర్స్ ఇప్పుడు మిడ్ స్పెక్ కామెట్ ఎక్సైట్‌లో కూడా ఉన్నాయి. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌కు లెథరెట్ సీట్లు అమర్చారు.
డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ కలిగిన 10.25 అంగుళాల స్క్రీన్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవే లేటెస్ట్ గా అప్డేట్ అయిన 2025 MG కామెట్ వేరియంట్లలో కొత్త ఫీచర్లు.
2025 MG కామెట్ EV స్పెసిఫికేషన్లు, రేంజ్
MG కామెట్ ఎలక్ట్రిక్ వెహికల్ 42hp మోటార్ ను కలిగి ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 230 km రేంజ్ వరకు దూసుకుపోతుంది.
కామెట్ EVలో 42hp పవర్, 110Nm టార్క్ ఉత్పత్తి చేసే మోటార్ ఉండటం వల్ల ఉత్తమమైన పనితీరును అందిస్తుంది.
ఇది కూడా చదవండి సీఎన్‌జీ కారుల్లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి ఇవే!
ఛార్జింగ్
MG మోటార్ ఇండియా కంపెనీ కామెట్ ఎక్స్‌క్లూజివ్, ఎక్సైట్ వేరియంట్‌లలో 7.4k W AC ఛార్జర్‌ను ప్రవేశపెట్టింది. ఇది బ్యాటరీని 3.5 గంటల్లో ఛార్జ్ చేస్తుంది. కేవలం రూ. 11,000 కట్టి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి బైక్‌లో ఇంజిన్ ఆయిల్ టైంకి మార్చకపోతే ఎంత డేంజరో తెలుసా?