TCS: టిసిఎస్ నుంచి 12,000 మంది ఉద్యోగులు తొలగింపు, అదికూడా రెండేళ్ల ముందుస్తూ జీతం ఇచ్చి మరీ

Published : Oct 03, 2025, 11:55 AM IST

టిసిఎస్ (TCS)లో తొలగింపుల ప్రక్రియ మొదలైపోయింది. అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు టిసిఎస్ కొత్త ఆలోచన చేసింది. రెండేళ్ల జీతాన్ని ముందుగానే ఇచ్చి తెగతెంపులు చేసుకోబోతోంది. 

PREV
15
టీసీఎస్ డేరింగ్ స్టెప్

దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవలను అందించే సంస్థ టిసిఎస్. టిసిఎస్ లో ఉద్యోగం వస్తే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినంత ఆనందంగా ఉంటారు. అయితే తొలిసారి టిసిఎస్ చాలా పెద్ద అడుగు ముందుకు వేస్తోంది. కంపెనీ నిర్మాణాన్ని మార్చేందుకు అవసరమైన మార్పులు చేస్తోంది. ఇందులో తమ కంపెనీ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు లేని ఉద్యోగులను లే ఆఫ్ చేసేందుకు సిద్ధమయింది. అయితే ఈ లే ఆఫ్ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడకుండా సెవెరెన్స్ ప్యాకేజీలను ప్రకటించింది. ఆ ప్యాకేజీల వల్ల ఉద్యోగులు వెంటనే ఇబ్బంది పడకుండా ఉంటారని, వారికి ఉద్యోగం వెతుక్కునే సమయం కూడా అధికంగానే ఉంటుందని టిసిఎస్ భావిస్తోంది. ఇంతకీ ఉద్యోగులకు ఎంత మొత్తంలో జీతాన్ని ముందస్తుగానే అందిస్తోందో తెలుసుకోండి

25
12వేల మంది అవుట్

టిసిఎస్ ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగంలో రెండు శాతం మందిని తొలగించుతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ తొలగింపులు ప్రక్రియ ఉంటుందని చెప్పింది. అంటే దాదాపు 12వేల మంది ఉద్యోగులను టిసిఎస్ తగ్గించుకోనుంది. సాంకేతికత వేగంగా మారడం, ఆటోమేషన్ కారణంగానే టిసిఎస్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెబుతోంది. అయితే అందరి ఉద్యోగులపై ఈ ప్రభావం పడదు. తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోలేని వారు పాత నైపుణ్యాలతోనే ఉద్యోగం చేస్తున్న వారికే ఈ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 15 ఏళ్ల సర్వీసు దాటిన ఉద్యోగులపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. సెవెరన్స్ ప్యాకేజీ ద్వారా ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయాక వారికి అందించే ఆర్థిక సహాయంగా టిసిఎస్ చెబుతోంది.

35
మూడు నెలల జీతం వీరికి

టిసిఎస్ చెబుతున్న ప్రకారం లేఆఫ్ అయిన ఉద్యోగులకు మొదటి మూడు నెలలు నోటీసు పీరియడ్ ఉంటుంది. ఆ నోటీసు పీరియడ్లో వారికి జీతం లభిస్తుంది. ఆ తర్వాత వారి సర్వీసును బట్టి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు వచ్చే జీతం ముందస్తుగానే వారికి ఇస్తారు. అయితే ఒక ఉద్యోగి ఎనిమిది నెలల పాటు ఎలాంటి పని లేకుండా బెంచ్ పైనే ఉంటే.. అతడికి మాత్రం ఎలాంటి లాభము ఉండదు. మూడు నెలల నోటీసు పిరియడ్లో వచ్చే జీతం మాత్రమే వారికి అందుతుంది.

45
వీరికి రెండేళ్ల జీతం ముందుగానే

టిసిఎస్ లో 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. అలా పదేళ్ల నుంచి 15 ఏళ్ల లోపు సర్వీసు ఉన్న టిసిఎస్ ఉద్యోగులకు ఒకటిన్నర సంవత్సరాల జీతం సెవెరెన్స్ ప్యాకేజీగా అందిస్తారు. ఇక 15 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులకు గరిష్టంగా రెండు సంవత్సరాల జీతాన్ని సెవెరన్స్ ప్యాకేజీగా అందిస్తారు.

55
మానసిక చికిత్స ఖర్చులు

టిసిఎస్ ఈ ఆర్థిక సహాయంతో పాటు వారి కెరీర్ కు అవసరమైన మద్దతును కూడా అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో అవుట్ ప్లేస్మెంట్ సేవలు కూడా ఉన్నాయి. అలాగే కంపెనీ కేర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగులకు మానసిక ఆరోగ్య చికిత్సను కూడా అందిస్తుంది. ఆ ఖర్చులను కూడా తామే భరిస్తుంది. ఇక పదవీ విరమణ కోసం సిద్ధంగా ఉన్న ఉద్యోగులకు ముందుగానే టిఆర్ఎస్ తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అలాగే పదవీ విరమణ ప్రయోజనాలను పూర్తిగా వారికి అందించేందుకు సిద్ధపడింది.

Read more Photos on
click me!

Recommended Stories