Maruti Suzukiతో చేతులు కలిపిన Indian Bank, కస్టమర్లకు మరింత సులభంగా రుణాలు...

First Published May 12, 2022, 12:55 PM IST

Maruti Suzuki with Indian Bank: మారుతీ సుజుకి ఇండియా కస్టమర్లకు సులభమైన కార్ లోన్‌లను అందించడానికి ఇండియన్ బ్యాంక్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం కింద, తమ కస్టమర్లు మెట్రోపాలిటన్, అర్బన్, సెమీ అర్బన్ మరియు రూరల్ ఏరియాల్లోని ఇండియన్ బ్యాంక్‌కు చెందిన 5,700 బ్రాంచీల నుంచి రుణాలు పొందవచ్చని కంపెనీ బుధవారం తెలిపింది. ఈ ప్రత్యేక పథకం కింద, మారుతి సుజుకి కస్టమర్లు కారు ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాలు పొందవచ్చు.

Maruti Suzuki with Indian Bank for car loans: ప్రముఖ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన కస్టమర్లకు సులభంగా రుణాలు అందేలా, ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఇండియ‌న్ బ్యాంకు ( Indian Bank)తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా, కంపెనీ తన కస్టమర్లు ఇండియన్ బ్యాంక్‌కి చెందిన మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లోని 5,700కి పైగా బ్రాంచ్‌లలో సులభంగా కార్ లోన్ (car loan) పొందే అవకాశం కలిగింది. 

ఈ ఒఫ్పందం వల్ల ఏంటి లాభం...
ఇండియన్ బ్యాంకుతో మారుతి సుజుకి ఒఫ్పందం ద్వారా  కస్టమర్లు కారు ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాన్ని పొందగలరు. అంతేకాదు కారు లోన్ పై జీరో ప్రాసెసింగ్ ఫీజు, ఫ్రీ ఫాస్టాగ్, లాంటివి కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.  అలాగే 30 లక్షల వరకు ఉచిత బీమా రక్షణ, సులభమైన EMI ఎంపికను కూడా పొందవచ్చు. ఫైనాన్ వ్యవహారంలో కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తకుండా, మారుతీ సుజుకీకి ఇండియ‌న్ బ్యాంక్ చేదోడు వాదోడుగా నిలుస్తుంది.  

ఈ పథకంలో భాగంగా రుణ చెల్లింపు కోసం 84 నెల‌ల వ‌ర‌కు టెన్యూర్ ను ఎంచుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం 2022 జూన్‌ 30 వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.  ఆటోమొబైల్ పరిశ్రమలో దాదాపు 80 శాతం అమ్మకాలు ఫైనాన్స్ ద్వారా జరుగుతున్నాయని, తమ కస్టమర్లు కార్లను కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో చేతులు కలిపామని మారుతీ సుజుకీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
 

మారుతి సుజుకి 2,156 నగరాలు, పట్టణాలలో 3,357 కొత్త కార్ రిటైల్ అవుట్‌లెట్‌లతో విస్తారమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ భాగస్వామ్యంతో, కార్‌మేకర్ ఇప్పుడు మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 11 ప్రైవేట్ బ్యాంకులు, 7 NBFCలు, 7 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా 37 ఆర్థిక సంస్థలతో టై-అప్‌లను కలిగి ఉంది.

ఇండియన్ బ్యాంక్‌తో కొత్త భాగస్వామ్యం దాని వినియోగదారులకు కార్ లోన్స్ కోసం మరిన్ని ఫైనాన్స్ ఎంపికలను అందిస్తుంది. బ్యాంక్ దేశవ్యాప్తంగా విస్తృత ఉనికిని కలిగి ఉందని, ఫైనాన్సింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి వడ్డీ రేటు పరంగా మల్టిపుల్ ఆప్షన్స్ తో, కస్టమర్లకు కార్ ఫైనాన్సింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి కట్టుబడి ఉంది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ శాంతి లాల్ మాట్లాడుతూ, "మారుతి సుజుకీ కస్టమర్లకు కారు కొనుగోలు చేయాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి వారికి అత్యుత్తమమైన సేవలను అందించగలమన్న విశ్వాసం మాకు ఉంది" అని అన్నారు.

click me!