34 కి.మీ. మైలేజ్ ఇచ్చే బెస్ట్ లాంగ్ డ్రైవ్ కారు ఇదిగో..

First Published | Nov 21, 2024, 5:59 PM IST

లాంగ్ డ్రైవ్ వెళ్లేందుకు మీకు బెస్ట్ కారు కావాలా? అయితే మారుతి సుజుకి అందిస్తున్న ఈ కారు ట్రై చేయండి. 34 కి.మీ. అత్యధిక మైలేజ్ ఇచ్చే ఈ కారు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ తో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో బాగుంటుంది. ఈ కారు ధర, ఇతర ఫీచర్లు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. కారు కొనే ఆలోచనలో ఉంటే వెంటనే కొనుగోలు చేస్తారు. 

మారుతి సుజుకి Eeco MPV మోడల్ పేరుతో కొత్త కారు రిలీజ్ చేసింది. ఇది చూడటానికి మిని బస్సుకంటే చిన్నగా ఉన్నా అలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం కార్ల మార్కెట్ లో రోజులో మోడల్ రిలీజ్ అవుతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మీకు లాంగ్ డ్రైవ్ వెళ్లేందుకు మంచి కారు కావాలంటే మారుతి సుజుకి అందిస్తున్న Eeco MPV మోడల్ ను ఓ సారి ప్రయత్నించండి. మారుతి సుజుకి ఇప్పుడు తన పోటీదారులను ఎదుర్కొంటూ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రీమియం ఫీచర్లతో వరుసగా కార్లను పరిచయం చేస్తోంది. అందులో Eeco MPV ఎక్కువగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 

మారుతి సుజుకి కస్టమర్లను ఆకట్టుకోవడానికి Eeco పేరుతో సెవన్ సీటర్ ను తీసుకొచ్చింది. పోటీ కంపెనీలు లగ్జరీ కార్లపై దృష్టి సారిస్తే మారుతి సుజుకి మిడిల్ క్లాస్, యూత్ ని ఆకట్టుకునేందుకు తగిన మోడల్స్ తీసుకొస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్ల కంటే చాలా ఎక్కువ ఆఫర్లతో Eeco మోడల్ తీసుకొచ్చింది. మారుతి సుజుకి నుండి వచ్చిన ఈ 7-సీటర్ కారు అత్యుత్తమ శక్తివంతమైన ఇంజిన్‌తో పనిచేస్తుంది. అంతే కాకుండా ఇందులో అత్యుత్తమ ఫీచర్లను కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు. 


మారుతి సుజుకి Eeco MPV డీటైల్స్ పరిశీలిస్తే MPV భాగాలతో కూడిన ఈ వాహనం 1.0 లీటర్, 1.2 పెట్రోల్ ఇంజిన్లతో వస్తోంది. మీ కెపాసిటీ, అవసరాల మేరకు మీరు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోర్ వీలర్ వెహికల్స్ లో అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనం ఇదే అవుతుంది. మారుతి సుజుకి లోనే ఇతర వాహనాలతో పోలిస్తే Eeco MPV లీటరుకు 34 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇలాంటి మోడల్ కార్లలో ఇదే అత్యుత్తమమైన కారు కావడం విశేషం. అందుకే ఇది లాంగ్ డ్రైవ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.  

ఫీచర్ల పరంగా చూస్తే మారుతి సుజుకి తన Eeco MPV వాహనాన్ని MPV డిజైన్ విభాగంలో ఎక్కువగా రీమోడల్ చేసింది. సెమీ-డిజిటల్ స్పీడోమీటర్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, మాన్యువల్ A/C సౌకర్యాలతో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మీకు రక్షణగా నిలుస్తాయి. 12V ఛార్జింగ్ సాకెట్, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌ల వంటి నూతన ఫీచర్లతో ఈ వాహనాన్ని మారుతి సుజుకి పరిచయం చేసింది. భారతీయ మార్కెట్లో ఇది టాటా, ఇతర మోడల్స్ కి పోటీ ఇస్తోంది. 

భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి Eeco MPV ధర లోఎండ్ మోడల్ రూ.5.50 లక్షలకు లభిస్తుంది. హైఎండ్ మోడల్ గరిష్టంగా రూ.7 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి నుండి వచ్చిన ఈ కొత్త MPV కారు కస్టమర్లకు ఇతర కంపెనీల కార్ల కంటే బెస్ట్ కారు  అని చెప్పొచ్చు. 

Latest Videos

click me!