ఇలా చేస్తే చలికాలంలోనూ మీ వెహికల్ దూసుకుపోతుంది. మైలేజ్ అస్సలు తగ్గదు

First Published | Nov 21, 2024, 2:56 PM IST

చలికాలంలో కారైనా, బైక్ అయినా మైలేజ్ తగ్గుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, చిక్కటి ఇంజిన్ ఆయిల్, టైర్ ప్రెషర్‌లో మార్పులు ఇలా అనేక రీజన్స్ ఉంటాయి. అయితే చలికాలంలోనూ మీ వెహికల్ ఇంజన్ పర్ఫెక్ట్ గా పనిచేసేలా, మైలేజ్ పెంచేలా ఏం చేయాలో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం రండి. 

చలికాలం డ్రైవర్లకు, రైడర్లకు కష్టకాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువగా వారి వెహికల్స్ కి ఇంజన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంతేకాకుండా మైలేజ్ కూడా తగ్గిపోతుంది. చలి వాతావరణం కార్లు, బైక్‌లను ప్రభావితం చేస్తుంది. ఇంజిన్ పనితీరు, టైర్ ప్రెషర్ వంటి అంశాల వల్ల మైలేజ్ తగ్గుతుంది. మీ వాహనాన్ని పర్ఫెక్ట్ గా ఉంచడానికి, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. 

చలికాలంలో ఫ్యూయల్ ఎందుకు ఎక్కువ ఖర్చువుతుందో కారణాలు ఇక్కడ ఉన్నాయి.

ఇంజిన్ వేడెక్కే సమయం
చలికాలంలో మీ కారు లేదా బైక్ ఇంజిన్ సరైన ఆపరేటింగ్ టెంపరేచర్ కి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంజిన్ చల్లగా ఉండటం వల్ల ఫ్యూయల్ తక్కువ సామర్థ్యంతో మండుతుంది. దీనివల్ల ఇంజన్ వేడెక్కే టైం లో ఫ్యూయల్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది.

ఎయిర్ డెన్సిటీ, డ్రాగ్
చల్లని గాలికి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ వాహనంపై ఏరోడైనమిక్ డ్రాగ్‌ను పెంచుతుంది. ఈ డ్రాగ్ మీ ఇంజిన్‌ను కష్టపడి పనిచేయించేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ ఫ్యూయల్ ఖర్చవుతుంది. 


టైర్ ప్రెషర్ తగ్గడం
చల్లని వాతావరణం వల్ల టైర్ ప్రెషర్ తగ్గుతుంది. రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. తక్కువ టైర్ ప్రెషర్ మీ వాహనాన్ని తక్కువ సమర్థవంతంగా చేస్తుంది. ఇది మైలేజ్‌ని ప్రభావితం చేస్తుంది.
 

ఇంధన దహన సామర్థ్యం(Fuel combustion efficiency)

చల్లని వాతావరణంలో పెట్రోల్, డీజిల్ పూర్తిగా ఆవిరవుతాయి. ముఖ్యంగా వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారిగా ఫ్యూయల్ ఖర్చవుతుంది. ఫలితంగా ఇంధనం వృథా అవుతుంది.

చలికాలంలో మైలేజ్‌ని ఎలా మెరుగుపరచాలో టిప్స్ ఇక్కడ ఉన్నాయి. 

ఇంజిన్ ఐడ్లింగ్ తగ్గించండి
మీ వెహికల్ కారైనా, బైక్ అయినా ఎక్కువసేపు వేడెక్కనివ్వకండి. పాత వాహనాల సంగతి ఎలా ఉన్నా ఈ కాలం వెహికల్స్ జస్ట్ 30 సెకన్లు వేడెక్కనిస్తే సరిపోతుంది. వాహనాల పనితీరు బాగుంటుంది. 

టైర్ ప్రెషర్ మెయింటెనెన్స్ చేయండి
మీ వెహికల్ టైర్లు ఏ కంపెనీవి అయితే వారు టైర్ ప్రెషర్‌ ఎంత మెయింటైన్ చేయాలో లిస్ట్ ఇస్తారు. దాని ప్రకారం క్రమం తప్పకుండా తనిఖీ చేసి గాలి పట్టించండి. సరిగ్గా గాలి నింపిన టైర్లు రోలింగ్ రెసిస్టెన్స్‌ను తగ్గించి ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించండి
మీ ఇంజిన్, ఎయిర్ ఫిల్టర్లు, స్పార్క్ ప్లగ్‌లు మంచి స్థితిలో ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉన్న వాహనం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది.

సరైన ఆయిల్ వాడండి
మీ వెహికల్ కి సిఫార్సు చేయబడిన వింటర్-గ్రేడ్ ఆయిల్‌ వాడండి. ఇది లో టెంపరేచర్ లోనూ బాగా ప్రవహిస్తుంది. ఇంజిన్ పై ఒత్తిడిని తగ్గిస్తుంది. మైలేజ్‌ని మెరుగుపరుస్తుంది.

Latest Videos

click me!