Union Budget 2022: క్రిప్టోకరెన్సీ బిల్లుపై బిగ్ న్యూస్.. ఈసారి బడ్జెట్ లోనూ లేనట్టేనా..?

First Published | Jan 18, 2022, 1:19 PM IST

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీల(cryptocurrencies) ప్రజాదరణ అంటే డిజిటల్ కరెన్సీ (digital currency)వేగంగా పెరుగుతోంది. మరోవైపు భారతదేశంలో కూడా క్రిప్టో పెట్టుబడిదారుల(investors) సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక నివేదిక ప్రకారం, దేశంలో 10.7 కోట్ల మంది క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టారు.

ఈ  ఆన్ రెగ్యులేటెడ్ మార్కెట్‌ను నిర్వహించడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన క్రిప్టోకరెన్సీ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడం సాధ్యం కాలేదు అయితే రాబోయే బడ్జెట్ సెషన్‌లో కూడా ప్రవేశపెట్టే అవకాశం లేనట్టు తెలుస్తుంది.
 

క్రిప్టో బిల్లుకు మరింత సమయం
క్రిప్టో బిల్లు చాలా సంక్లిష్టమైన సబ్జెక్ట్ అని, దీనికి ఇంకా సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ సంక్లిష్ట సమస్యపై మరింత జాగ్రత్తలు, చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఒక నివేదిక పేర్కొంది. దీనితో పాటు, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో ఏకాభిప్రాయాన్ని నిర్మించడం కూడా అవసరం. మరికొద్ది నెలల్లో డిజిటల్ కరెన్సీని విడుదల చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సన్నాహాలు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా దీని కోసం ఎదురుచూస్తోంది.
 


నివేదిక ప్రకారం, యూరోపియన్ యూనియన్ (EU) ఇంకా ఇతర చోట్ల క్రిప్టోకరెన్సీలపై గ్లోబల్ స్టాండర్డ్స్ ఎలా అభివృద్ధి చెందుతాయి అనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. అదనంగా, క్రిప్టోకరెన్సీ ఫ్రేమ్‌వర్క్ గురించి మరింత లోతైన అవగాహన కోసం ప్రభుత్వం ఇంకా ఆర్‌బి‌ఐ కూడా స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ (BIS) నుండి సమాచారాన్ని పొందనుంది. 
 

క్రిప్టోకరెన్సీ బిల్లు అంటే ఏమిటి, దాని ప్రయోజనం ఏంటి ?
క్రిప్టోకరెన్సీల నియంత్రణను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లు పేరు క్రిప్టోకరెన్సీ అండ్ ఆఫీషియల్  డిజిటల్ కరెన్సీ రెగ్యులేషన్ బిల్లు 2021.  క్రిప్టోకరెన్సీల నిషేధం ఇంకా అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2019 ఈ రెండు వేరు వేరు. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్థిక వ్యవహారాల శాఖ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సెబీ ఇంకా ఆర్‌బిఐ ప్రతినిధులతో కూడిన ఇంటర్నల్-మంత్రిత్వ కమిటీ దీనిని సిఫార్సు చేసింది, అయితే దీనిని పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టలేదు. 
 

భారతదేశంలో క్రిప్టో పెట్టుబడిదారులు
క్రిప్టోకరెన్సీ మార్కెట్ నియంత్రణ లేనిది ఇంకా చాలా ప్రమాదకరం. పెట్టుబడిదారులు క్షణాల్లో  ధనవంతులు కావొచ్చు లేదా ఒక్క క్షణంలోనే కోలుకొని ఆర్ధిక స్థితికి చేరుకోవచ్చు. అయితే భారతదేశంతో సహా ప్రపంచంలో క్రిప్టో పట్ల ప్రజల క్రేజ్  రోజురోజుకి పెరుగుతోంది. దీనికి సంబంధించి విడుదలైన పలు నివేదికల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో క్రిప్టో పెట్టుబడులు భారత్‌లో ఉన్నారు. దేశంలో క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య దాదాపు 107 మిలియన్లకు చేరుకుందని, 2030 నాటికి క్రిప్టోకరెన్సీల్లో భారతీయుల పెట్టుబడులు 241 మిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఒక నివేదిక పేర్కొంది. 

Latest Videos

click me!