మహీంద్రా XUV 700, స్కార్పియో క్లాసిక్, స్కార్పియో N, బొలెరో, XUV400 EV వంటి కార్లపై ఈ దీపావళికి ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. XUV 300, XUV 400 EV, XUV 700, స్కార్పియో క్లాసిక్, స్కార్పియో N, బొలెరో, బొలెరో నియో వంటి మోడళ్లపై రూ. 4.4 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. పాత మోడళ్లపై అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు.
XUV300 యూనిట్లు కొన్ని షోరూమ్‌లలో రూ.1.8 లక్షల వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. XUV 400 EV దాదాపు ఒక సంవత్సరంగా రూ.2 లక్షలకు పైగా డిస్కౌంట్‌తో లభిస్తోంది. కొన్ని యూనిట్లు, ఎక్కువగా MY2023 ఉత్పత్తి బ్యాచ్‌ల నుండి రూ.4.4 లక్షల వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. XUV 700 ఈ సంవత్సరం అనేక ధర తగ్గింపులు, ఫీచర్ మార్పులను చూసింది.