స్పెషల్ ఫీచర్స్ ఇవే..
BE 6, XEV 9eలు ఇంగ్లో(INGLO) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. 59kWh, 79kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తాయి. అలాగే 170kW, 210kW మోటార్ ఆప్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
BE 6 కారు 100 kmph వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో అందుకుంటుంది. XEV 9e అయితే 6.8 సెకన్లలో అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 175kW DC ఛార్జర్‌తో 20 నిమిషాల కంటే తక్కువ సమయంలో 80 % ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ తెలిపింది. BE 6, XEV 9e వరుసగా 683 కి.మీ, 656 కి.మీ వరకు ప్రయాణించగలవు.