కేంద్రం ఇటీవల దేశీయ LPG ధరలను తగ్గించిన తరువాత, పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) స్పందించి 19-KG కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 158 తగ్గించాయి. ఈ ధర తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ఇప్పుడు రూ. 1,522గా ఉంది.

రక్షా బంధన్‌ను పురస్కరించుకుని, దేశంలోని మహిళలకు కానుకగా అందించిన కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్‌పిజి ధరను రూ.200 తగ్గించింది. వాణిజ్య , గృహ LPG (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్‌ల కోసం ఈ ధరల సవరణలు ప్రతి నెల ప్రారంభంలో జరుగుతుండటం గమనించదగ్గ విషయం.
ముఖ్యంగా, అంతకుముందు ఆగస్టు నెలలో, OMCలు ఇప్పటికే వాణిజ్య LPG సిలిండర్ల ధరలను రూ.99.75 తగ్గించాయి. ఇది జూలైలో వాణిజ్య ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌పై రూ.7 స్వల్పంగా పెరిగింది.
ఈ పరిణామాలకు ముందు, వాణిజ్య LPG సిలిండర్ల ధరలలో వరుసగా రెండు సార్లు తగ్గింపులు అందించింది. అదే సంవత్సరం మే, జూన్‌లలో ఇది జరిగింది. మేలో OMCలు కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ. 172 తగ్గించగా, జూన్‌లో రూ.83 తగ్గించింది. ఇప్పుడు ఉజ్వల్ పథకం కింద లబ్ధిదారులకు రూ.400 సబ్సిడీని ప్రకటించారు. వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గించడం రెస్టారెంట్ లతో పాటు బేకర్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇదిలా ఉంటే రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు బహుమతిని అందించినందుకు ప్రధానికి అభినందనలు తెలుపుతూ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు బహుమతి ఇవ్వాలని భావించినందుకు నేను ప్రధానమంత్రిని అభినందించాలని పేర్కొన్నారు.