Cheque: చెక్ పై స్పెల్లింగ్ తప్పులు రాశాడని ఉద్యోగమే ఊడిపోయింది, ఈ తప్పు మీరు చేయకండి

Published : Oct 11, 2025, 01:14 PM IST

చెక్ పై (Cheque) స్పెల్లింగ్ తప్పులు అనుకోకుండా రాసినా కూడా ఉద్యోగానికి నష్టం రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ మీద పేరు, డబ్బులు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. లేకపోతే అత్తర్ సింగ్‌లాగా ప్రభుత్వోద్యోగాన్ని కోల్పోవచ్చు. 

PREV
14
టీచర్ కు రాయడం రాదా?

కష్టపడి సంపాదించుకున్న ప్రభుత్వ ఉద్యోగం కానీ చిన్న తప్పు వల్ల కోల్పోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అత్తర్ సింగ్. ఇతడి కథనం ఇప్పుడు వైరల్ గా మారింది. అతను స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నాడు. అతను ఒక చెక్ పై 7,616 రూపాయల డబ్బులకు చెక్ రాసిచ్చాడు. అయితే అమౌంట్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి. దీంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.

24
నెంబర్స్ స్పెల్లింగ్ తెలియక

సస్పెన్షన్ ఉత్తర్వు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ సాధారణంగా స్పెల్లింగ్ తప్పులను ఎవరు పట్టించుకోరని, కేవలం హెచ్చరించి వదిలేస్తారని అన్నారు. కానీ అత్తర్ సింగ్ మాత్రం టీచరై ఉండి కూడా దారుణంగా స్పెల్లింగ్ తప్పులు రాశాడని చెప్పారు. ఏకంగా పదాలనే మార్చేశాడని చెప్పారు. రూ.7,616 అని రాయడానికి ‘సెవెన్ తర్స్‌డే సిక్స్ హరేంద్ర సిక్ట్సీ’ అని రాశాడు. థౌజండ్ అని రాసేందుకు థర్స్‌డే రాశాడు. ఇక హండ్రెడ్ అని రాయడానికి హరేంద్ర అని రాశాడు. ఒక స్కూల్ టీచర్‌కి ఈ మాత్రం కూడా రాయడం రాకపోవడం చాలా హేయమైన పరిస్థితి అని విద్యాధికారులు అభిప్రాయపడ్డారు.

34
ఉద్యోగం ఏం చేయగలడు?

టీచర్‌కే కనీసం స్పెల్లింగ్ లు రాకపోతే, పదాలు రాయడం రాకపోతే ఆ వ్యక్తి ఉద్యోగానికి ఎంత న్యాయం చేయగలడని అధికారులు చెబుతున్నారు. అయితే మరొక విశేషం ఏంటంటే ఉపాధ్యాయుడికి ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్లో కూడా ఎన్నో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ అనే పదంలో కూడా స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ అనే పదాన్ని కూడా సరిగా రాయలేకపోయారు. దీనిపై కూడా అధికారులు మాట్లాడుతూ తాము తొందరపడి నోటీసు జారీ చేశామని, తప్పులు అంగీకరిస్తున్నామని, స్పెల్లింగ్ తప్పులు ఎలా జరిగాయో కనుక్కుంటానని చెప్పారు.

44
పూర్తి అక్షరాస్యత రాష్ట్రంలోనే ఇలా

మరొక విశేషం ఏమిటంటే ఈ ఏడాది సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరిగింది. ఆ రోజు హిమాచల్ ప్రదేశ్ ను పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించారు. కానీ అదే రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ టీచర్ కి కనీసం స్పెల్లింగ్ తప్పులు లేకుండా చెక్ రాయడం కూడా రాకపోవడం గమనార్హం.

Read more Photos on
click me!

Recommended Stories