పదవీ విరమణ తర్వాత ఎవరికైనా సంపాదన తగ్గిపోతుంది. వచ్చే అరకొర పెన్షన్ తో ప్రస్తుతం ఉన్న జీవనశైలి కొనసాగించడం కష్టం. అయితే మీ రిటైర్మెంట్ తర్వాత మీ అవసరాలు తీర్చుకోవడానికి, ఆరోగ్య ఖర్చుల కోసం ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది LIC. అదే ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్. 18 నుంచి 65 ఏళ్ల పైబడిన వాళ్లు ఎవరైనా తక్కువ పెట్టుబడితో భవిష్యత్తును కాపాడుకోవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత అవసరాలు ఎలా తీర్చుకోవాలి, ఆరోగ్య ఖర్చులు ఎలా చూసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. వారి కోసమే LIC స్మార్ట్ పెన్షన్ స్కీమ్ వచ్చేసింది. ఇది తీసుకుంటే.. తక్కువ పెట్టుబడితో మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవచ్చు.
24
ఈ ప్లాన్ 18 నుంచి 65 ఏళ్లు పైబడిన వాళ్ల కోసం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కస్టమర్లు LIC స్మార్ట్ పెన్షన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీసం రూ.1 లక్ష కొనాలి. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు.
34
గరిష్ట కొనుగోలు విలువ కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ స్కీమ్ కింద కనీస వార్షిక మొత్తం రూ.1000 చెల్లించాలి. ఈ స్కీమ్‌లో ఒక్కసారి మాత్రమే ప్రీమియం కట్టాలి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఏడాదికోసారి డబ్బులు కూడా ఇస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తి తర్వాత నామినీకి డబ్బులు అందుతాయి. www.licindia.in వెబ్‌సైట్‌లో ఈ పాలసీ గురించి తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు LIC ఏజెంట్, POSP- life insurance, common public service centers నుంచి ఈ పాలసీ కొనొచ్చు.
44
ఒక్క ప్రీమియంతో వెంటనే పెన్షన్ తీసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా పెన్షన్ మార్చుకోవచ్చు. సింగిల్ లేదా జాయింట్ లైఫ్ తీసుకోవచ్చు. ఇప్పటికే పాలసీ ఉన్నవాళ్లకు, నామినీలకు ఎక్కువ పెన్షన్ రేట్లు ఉన్నాయి.