LIC nominee:ఎల్‌ఐ‌సి పాలసీలో నామినీని మార్చాలనుకుంటున్నారా..? అయితే ఈ పద్ధతిని అనుసరించండి

First Published Jan 25, 2022, 12:04 AM IST

ఒక వ్యక్తి  జీవిత భద్రత/ భరోసా లేదా కుటుంబం మెరుగైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎన్నో పెట్టుబడులు పెడుతుంటారు. తద్వారా అతని కుటుంబం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉంటుంది. నేటికీ అన్ని రకాల పెట్టుబడులలో ప్రజలు ఎల్‌ఐసిని ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అలాగే ఎన్నో ఏళ్లుగా ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే ఎల్‌ఐసి ఉంది.

ఇంకా ప్రజలు ఎల్‌ఐసీలో పెట్టిన పెట్టుబడిని సురక్షితమైనదిగా భావిస్తారు. ఎల్‌ఐసిలోని పాలసీ 'జీవన్ సాథ్ భీ ఔర్ బాద్ భీ'ని ప్రజలు  చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే ప్రజలు  కుటుంబ భద్రత, మెరుగైన భవిష్యత్తు కోసం ఎల్‌ఐసీలో అన్ని రకాల పెట్టుబడులు పెడతారు. ఎల్‌ఐసిపై ప్రజల విశ్వాసానికి అతి ముఖ్యమైన కారణం  మార్కెట్  అస్థిరత ఇంకా నష్టాలకు దూరంగా ఉండడమే. కాబట్టి ప్రజలు ఎల్‌ఐ‌సిలో పెట్టుబడి పెట్టడంపై చింతించరు. అయితే మీరు ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్నప్పుడు నామినీని పెడుతుంటారు. 

మీరు ఎంచుకున్న  పాలసీకి చట్టపరమైన వారసుడు ఎవరు అని. అయితే ఒకసారి ఎల్‌ఐ‌సి నామినిని ఎంచుకున్న తర్వాత ప్రజలు మళ్ళీ నామినీని మార్చుకోవాలనుకుంటే, ఇందుకు ఎల్‌ఐ‌సి  ఒక సదుపాయాన్ని అందిస్తుంది, దీన్ని ద్వారా సులభంగా నామినిని మార్చుకోవచ్చు. కాబట్టి దీని గురించి ఎంటో  తెలుసుకుందాం...

ఎల్‌ఐ‌సిలో నామినీని మార్చడానికి-

స్టెప్ 1
ఎల్‌ఐ‌సిలో నామినీని మార్చడానికి, మీరు ముందుగా దాని అధికారిక వెబ్‌సైట్ https://licindia.in/ ఓపెన్ చేయండి...

స్టెప్ 2
దీని తర్వాత నామినీని మార్చడానికి ఒక ఫారమ్ కనిపిస్తుంది, మీరు దాన్ని నింపల్సి ఉంటుంది. అలాగే, మీరు ఎవరి పేరుని నామినిగా జోడిస్తున్నారో వారితో మీ సంబంధాన్ని వెల్లడించండి. 
 

స్టెప్ 3
ఆ తర్వాత మీరు మీ శాఖకు వెళ్లి అక్కడ కూడా మీ నామినీని మార్చుకోండి. ఇందుకోసం జీఎస్టీతో పాటు కొంత చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
 

స్టెప్ 4
అలాగే పాలసీ మెచ్యూరిటీకి ముందు మీరు మీ నామినీని మార్చవచ్చు. అలాగే ఈ పాలసీని మీరు ప్రారంభించిన  శాఖ నుండి  మొత్తం చేయబడుతుంది.
 

click me!