బిట్‌కాయిన్-ఎథెరియంతో సహా ఇతర క్రిప్టోకరెన్సీల పతనం.. పెట్టుబడిదారులు షాక్.. రష్యాతో సంబంధం ఏమిటో..

First Published Jan 22, 2022, 2:18 PM IST

కొత్త ఏడాదికి ప్రారంభం క్రిప్టో మార్కెట్‌(crypto market)కి ఏమాత్రం కలిసిరానట్లు కనిపిస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుండి చాలా వరకు క్రిప్టోకరెన్సీలలో ప్రారంభమైన క్షీణత ఇంకా కొనసాగుతోంది. దీంతో బ్లాక్ ఫ్రైడే (black friday)ప్రభావం శనివారం కూడా  ఏర్పడింది అలాగే Bitcoin-Ethereumతో సహా చాలా డిజిటల్ కరెన్సీల ధరలు పడిపోయాయి.  ఒక నివేదిక ప్రకారం, ఇటీవలి రోజుల్లో క్రిప్టోకరెన్సీ(cryptocurrency)ల వాల్యు క్షీణతకు ప్రధాన కారణం దేశంలో  మైనింగ్‌ను నిషేధించాలనే రష్యా సెంట్రల్ బ్యాంక్(russia central bank) ప్రతిపాదన. 
 

అత్యంత ప్రజాదరణ పొందిన బిట్‌కాయిన్  రోజులు పోయాయి
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ పరిస్థితి శనివారం కూడా పేలవంగా ఉంది. అలాగే 7.08 శాతం క్షీణించింది. ఈ విధంగా దాని ధర రూ.2,23,200 తగ్గి రూ.29,28,746కి చేరింది. ఈ పతనంతో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.55 లక్షల కోట్లకు పడిపోయింది. విశేషమేమిటంటే, ఆగస్టు 2021 తర్వాత బిట్‌కాయిన్‌లో ఇది అత్యల్ప స్థాయి. దీనికి ముందు, గత సంవత్సరం నవంబర్‌లో బిట్‌కాయిన్  ఆల్-టైమ్ హై ఫిగర్‌ను తాకింది, అయితే అప్పటి నుండి  విచ్ఛిన్నమవుతూనే ఉంది.

గత ఏడాది నవంబర్ 2021లో బిట్‌కాయిన్ ధర ఆల్ టైమ్ హైకి చేరుకోవడం గమనార్హం . బిట్‌కాయిన్ ధర నవంబర్‌లో 68,990డాలర్లకి చేరుకుంది, అయితే అప్పటి నుండి క్రమంగా క్షీణించింది. శనివారం నాటికి, బిట్‌కాయిన్ ధర నవంబర్‌లో ఆల్ టైమ్ హై కంటే 46 శాతం తగ్గింది. మరోవైపు 2022 సంవత్సరం గురించి మాట్లాడినట్లయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి బిట్‌కాయిన్ ధర ఒక నెలలోపు 15 శాతానికి పైగా విచ్ఛిన్నమైంది. 

 ఈ సంవత్సరంలో ఎథెరియం(Ethereum)ధర
బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా ఇతర డిజిటల్ కరెన్సీలతో సహా ప్రపంచంలోని టాప్ 10 క్రిప్టోకరెన్సీల ధరలు కూడా భారీగా పొడిపోతున్నాయి. రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ గురించి మాట్లాడితే ఎథెరియం ధర కూడా బాగా పడిపోయింది. శుక్రవారం 9 శాతం క్షీణత కనిపించగా, శనివారం దాని ధర 11.59 శాతం అంటే రూ. 26,924 తగ్గి రూ.2,05,323కి చేరుకుంది. క్రిప్టోకరెన్సీ ఎథెరియం ధర కూడా గత 24 గంటల్లో భారీగా పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 20 శాతం పడిపోయింది. 

ఇతర క్రిప్టోకరెన్సీలలో 
బిట్‌కాయిన్, ఎథెరియం నెల చూపులు చూస్తుండగా ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా క్లిష్ట స్థితిలో ఉన్నాయి. టాప్ 10 క్రిప్టోకరెన్సీల ధరలను పరిశీలిస్తే, శనివారం పోల్కాడోట్ 18 శాతం, డాడ్జ్‌కాయిన్ 8 శాతం, షిబా ఇను 19 శాతం, లిట్‌కాయిన్ 11 శాతం, బినాన్స్ కాయిన్ 13 శాతం, సోలానా 16 శాతం, టెర్రా 22 శాతం క్షీణించింది. మొత్తంమీద, గత నాలుగు రోజుల్లోనే క్రిప్టోకరెన్సీల విలువ దాదాపు 25% పడిపోయింది. గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ శనివారం 5 శాతం కంటే ఎక్కువ పడిపోయి 2 ట్రిలియన్ డాలర్ల మార్క్ క్రిందకు పడిపోయి 1.98 ట్రిలియన్‌కు చేరింది. దీంతో ఇన్వెస్టర్లకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 

రష్యా కనెక్షన్
క్రిప్టోకరెన్సీల పతనం నియంత్రితలేని ప్రమాదకర మార్కెట్‌గా పరిగణించబడుతుంది. ఇక్కడ పెట్టుబడిదారుడు క్షణంలో ఎంతో ఎత్తుకు చేరుకోవచ్చు లేదా ఒక్కసారిగా నష్టాలకి గురికావొచ్చు. భారతదేశంలోని పెట్టుబడిదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని క్రిప్టో బిల్లులను సిద్ధం చేయాల్సి రావడానికి ఇదే కారణం. క్రిప్టో మార్కెట్లో ఇటీవలి సంక్షిభం గురించి మాట్లాడితే కారణాలు రష్యాతో అనుసంధానించబడి ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రిప్టోకరెన్సీల వాల్యు క్షీణతకు ప్రధాన కారణం అక్కడి దేశంలో  మైనింగ్‌ను నిషేధించాలనే రష్యా సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదన. క్రిప్టోకరెన్సీలు రష్యా ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తెస్తున్నాయని, ప్రజలకు హాని కలిగించడంతోపాటు దేశ ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
 

click me!