7th Pay Commission:కేంద్ర ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్.. డీఏతో పాటు హెచ్‌ఆర్‌ఏ పెంపు..

First Published Jan 21, 2022, 12:15 PM IST

కేంద్ర ఉద్యోగులకు ఒక బిగ్ న్యూస్ అందబోతుంది.. ప్రభుత్వం త్వరలో వారి వేతనంలో భారీ పెంపును ప్రకటించనుంది. ఇందులో భాగంగా ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌(DA)తో పాటు హౌసింగ్ అలవెన్స్ కూడా పెంచే అవకాశం ఉంది. దీని ద్వారా 30 లక్షల మందికి పైగా కేంద్ర ఉద్యోగులు(central employees) లబ్ది పొందబోతున్నారని ఒక నివేదిక పేర్కొంది.  

దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు వారి కేటగిరీల ప్రకారం 9 శాతం, 18 శాతం, 27 శాతం చొప్పున హెచ్‌ఆర్‌ఏ (HRA)పొందుతున్నారు. కానీ ఇప్పుడు వీటికి అదనంగా హెచ్‌ఆర్‌ఏను 3 శాతం వరకు పెంచవచ్చని అంచనా. దీంతో కేటగిరీలను బట్టి హెచ్‌ఆర్‌ఏ రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతంగా ఉండనున్నాయి. అంటే కేంద్ర ఉద్యోగుల కనీస హెచ్‌ఆర్‌ఏ 10 శాతంగా ఉంటుంది. హెచ్ ఆర్ ఏ పెంపుతో కేంద్ర ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 ఏడవ వేతన సంఘం సిఫార్సు ప్రకారం, హెచ్‌ఆర్‌ఏ స్లాబ్ 30 శాతం, 20 శాతం, 10 శాతానికి బదులుగా 24 నుంచి 8 శాతానికి తగ్గించబడింది.  నివేదిక ప్రకారం, ఇంటి అద్దె భత్యం  HRA తదుపరి సవరణలో 3 శాతం పెరుగుదల ఉంటుంది. దీంతో హెచ్‌ఆర్‌ఏ ప్రస్తుతం ఉన్న 27 శాతం నుంచి 30 శాతానికి పెరుగుతుంది. అయితే, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు 50 శాతం దాటితేనే  జరుగుతుంది. Memorandum of DoPT ప్రకారం, DA 50 శాతం దాటితే, HRA 30 శాతం, 20 శాతం, 10 శాతం అవుతుంది.

 గత ఏడాది జూలైలో ప్రభుత్వం డీఏను 28 శాతానికి పెంచడం గమనార్హం. 25 శాతం దాటిపోవడంతో హెచ్‌ఆర్‌ఏ కూడా పెరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి వస్తున్న వార్తల ప్రకారం డీఏను 34 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపితే 50 శాతం దాటి హెచ్‌ఆర్‌ఏ రెండోసారి పెంపుదలకు మార్గం సుగమం అవుతుంది. 
 

డియర్‌నెస్ అలవెన్స్ 
జూలైలో 31 శాతంగా ఉన్న డీఏ సెప్టెంబరు వరకు 2 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడిప్పుడే అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడు నెలల లెక్కలు రాబోతున్నాయని, ఇందులో ఇంకా ఒక శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతానికి చేరవచ్చు.  
 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు అంచనా
2022 సంవత్సరం ప్రారంభం కేంద్ర ఉద్యోగులకు చాలా సంతోషంగా ఉండబోతోంది. వారు పొందే డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెరిగే అవకాశం ఉన్నప్పటికీ తాజా పెంపు తర్వాత కొత్త సంవత్సరంలో ఇంటి అద్దె అలవెన్స్ (HRA), ట్రావెలింగ్ అలవెన్స్ మళ్లీ పెరగవచ్చు. ఇందుకు సంబంధించి వస్తున్న నివేదికలను పరిశీలిస్తే ఉద్యోగులకు మరో ప్రయోజనం కలగబోతోంది. నిజానికి, కేంద్ర ఉద్యోగుల ఫిట్‌మెంట్ అంశంలో కూడా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగులకు అందే జీతంలో ఫిట్‌మెంట్ అంశం కీలక పాత్ర పోషిస్తుంది.  

click me!