ఎల్‌ఐసి ధన్ రేఖ సర్వైవల్ ప్రయోజనాలు
20 సంవత్సరాల పాలసీ - 10వ అండ్ 15వ సంవత్సరం చివరిలో హామీ మొత్తంలో 10%. 20వ సంవత్సరంలో 6వ సంవత్సరం నుండి 20వ సంవత్సరం వరకు 1,000 సమ్ అష్యూర్డ్‌కు రూ.50 చొప్పున సమ్ అష్యూర్డ్ + గ్యారెంటీడ్ అడిషన్ ఇవ్వబడుతుంది. అయితే 1 నుండి 5వ సంవత్సరానికి GA లేదు.
30 సంవత్సరాల పాలసీ - 15వ, 20వ అలాగే 25వ సంవత్సరం చివరిలో హామీ మొత్తంలో 15%. 30వ సంవత్సరంలో 6 నుండి 20 సంవత్సరాల వరకు సమ్ అష్యూర్డ్ + రూ. 1,000 సమ్ అష్యూర్డ్‌కు రూ.50 అదనపు హామీ ఇవ్వబడుతుంది. 21 నుండి 30వ సంవత్సరం వరకు 1,000 సమ్ అష్యూర్డ్‌కు రూ.55 చొప్పున GA ఇవ్వబడుతుంది.
40 సంవత్సరాల పాలసీ - 20వ, 25వ, 30వ ఇంకా 35వ సంవత్సరాల ముగింపులో హామీ మొత్తంలో 20%. 40వ సంవత్సరంలో 6 నుండి 20 సంవత్సరాల వరకు సమ్ అష్యూర్డ్ + రూ.1,000 సమ్ అష్యూర్డ్‌కు రూ.50 ఇవ్వబడుతుంది. 21 నుండి 30వ సంవత్సరం వరకు, 1,000 సమ్ అష్యూర్డ్‌కు రూ.55 చొప్పున GA ఇవ్వబడుతుంది. గత 31 నుండి 40 సంవత్సరాల కాలానికి GA 1000 సమ్ అష్యూర్డ్‌కు రూ. 60గా లెక్కించబడుతుంది.