FIRలో మీ పేరు నమోదైతే వచ్చే నష్టాలు ఇవే.. జన్మలో అమెరికా ప్రయాణం వెళ్లలేరు

Published : Mar 19, 2026, 08:00 AM IST

FIR: మీ పేరు మీద ఎఫ్ఐఆర్ (FIR) నమోదైతే ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందులు, సామాజిక నష్టాల గురించి హైకోర్టు అడ్వకేట్ ఏం చెప్పారంటే.. పాస్‌పోర్ట్, ఉద్యోగ అవకాశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

PREV
15
ఎఫ్ఐఆర్ (FIR)లో పేరు ఉంటే కలిగే నష్టాలు

సాధారణంగా ఏదైనా గొడవలు జరిగినప్పుడు లేదా నేరం జరిగినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్(First Information Report) నమోదు చేస్తారు. అయితే, ఎఫ్ఐఆర్‌లో పేరు నమోదు కావడం వల్ల ఒక వ్యక్తి జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. దీనిపై హైకోర్టు అడ్వకేట్ కీలక విషయాలను వెల్లడించారు.

25
ఎఫ్ఐఆర్ వల్ల కలిగే ప్రధాన నష్టాలు

పాస్‌పోర్ట్ సమస్యలు: మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఉంటే కొత్త పాస్‌పోర్ట్ రావడం లేదా ఉన్న పాస్‌పోర్ట్ రిన్యువల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. కోర్టు అనుమతి ఉంటేనే పాస్‌పోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా పరిమిత కాలానికే ఇస్తారు.

ఉద్యోగ అవకాశాలు: ప్రస్తుత కాలంలో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఉద్యోగంలో చేర్చుకునే ముందు 'బ్యాక్‌గ్రౌండ్ చెక్' చేస్తున్నాయి. ఎఫ్ఐఆర్‌లో పేరు ఉంటే అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఇది చాలా కీలకం.

35
లోన్లు బంద్

బ్యాంక్ లోన్స్ రావు: బ్యాంకులు లోన్లు ఇచ్చే ముందు కూడా ఇప్పుడు క్రెడిట్ చెక్‌తో పాటు లీగల్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తున్నాయి. ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటే రుణాలు పొందే అవకాశం తగ్గుతుంది.

సామాజిక పరపతి: సమాజంలో ఎఫ్ఐఆర్ నమోదైన వ్యక్తిని నేరస్థుడిగా చూసే ప్రమాదం ఉంది. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.

45
పేరును తొలగించుకోవడం ఎలా?

ఎఫ్ఐఆర్ లో పొరపాటున లేదా దురుద్దేశంతో పేరు చేర్చినట్లయితే, దానిని తొలగించుకోవడానికి చట్టంలో మార్గాలు ఉన్నాయి. హైకోర్టులో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయమని పిటిషన్ వేయవచ్చు. సరైన ఆధారాలు లేనప్పుడు కోర్టు ద్వారా కేసు నుండి విముక్తి పొందవచ్చు.

55
శిక్ష కాదు..

ఇన్వెస్టిగేషన్ సమయంలో విచారణ అధికారికి తగిన పత్రాలు సమర్పించి, ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ముందే పేరును తొలగించుకునే అవకాశం ఉంటుంది.

ఎఫ్ఐఆర్ అంటేనే శిక్ష కాదు. అది కేవలం దర్యాప్తు ప్రక్రియలో భాగం మాత్రమే. అయితే, దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే చట్టపరమైన అవగాహన పెంచుకోవడం, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories