మన భారతీయ వంటల్లో కచ్చితంగా కావాల్సింది అల్లం. వెజ్, నాన్ వెజ్ ఎలాంటి వంటలు అయినప్పటికీ ప్రతి ఒక్కరు అల్లం తమ వంటల్లో భాగం అవ్వాలని ఆశిస్తూ ఉంటారు. అల్లం పంటకు భారతదేశం చాలా ప్రసిద్ధి మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే అల్లం లో దాదాపు 35 శాతం భారతదేశంలోనే ఉత్పత్తి అవుతుంది పచ్చి అల్లంతో పాటు ఎండు అల్లం కూడా వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనిని సొంటి అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఉదర సంబంధిత వ్యాధులకు కూడా అల్లం దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అల్లం పంటకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అమెరికా చైనా యూరప్ దేశాలు అల్లంను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొంటాయి. కావున రైతులు అల్లం పంటను వేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అల్లం పంటను వేసేందుకు చక్కటి వాతావరణం ఉంది అల్లం పంటకు వేడి వాతావరణం చాలా అవసరం.
అంతే కాదు అల్లం పంటను ఎర్రనేలలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలోని పంట భూముల్లో అల్లం సాగు చాలా అనుకూలం అనే చెప్పాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం అల్లం విరివిగా పండుతుంది. నీరు నిలిచే నేలలు పెద్దగా ఉపయోగపడవు కావున అల్లం దుంపలను నీరు నిలవని ప్రదేశంలోనే నాటుకుంటే మంచిది.
అల్లం పంటకు పెద్దగా నీరు అవసరం లేదు వారానికి ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. అల్లం అనేది దుంప జాతికి చెందిన మొక్క కనుక నేలలో సారవంతంగా ఉంటే అల్లం పంట విరివిగా పండుతుంది. కావున అల్లం పంటను విరివిగా పండించుకోవచ్చు.
అల్లం పంట గురించి మీకు మరింత సమాచారం కోసం ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో నిపుణులైన వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సలహాలను పొందవచ్చు. ఇక అల్లం మార్కెటింగ్ విధానానికి వచ్చినట్లయితే, పచ్చి అల్లం, ఎండు అల్లం రెండిటికీ కూడా మంచి డిమాండ్ ఉంది కావున. మీరు ఈ రెండు రకాల అల్లం మార్కెటింగ్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఎండు అల్లం పొడి శొంఠి అని పిలుస్తారు. దీని విలువ చాలా ఎక్కువ. అల్లం పంటతో పాటు శొంఠి ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకుంటే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అల్లం పంట ఎనిమిది నెలల నుంచి ఏడాది మధ్యలో చేతికి వస్తుంది ఒక ఎకరంపై 8 లక్షల వరకు సంపాదించవచ్చు.