Business Ideas: 4 నెల‌లు క‌ష్ట‌ప‌డితే ల‌క్షాధికారి కావొచ్చు.. ఈ బిజినెస్‌తో స‌మ్మ‌ర్‌లో సిరులు కురుస్తాయి

Published : Feb 11, 2026, 05:43 PM IST

Business Ideas: ఎండాకాలం వ‌చ్చేస్తోంది. ఇప్ప‌టికే ఉష్ట్రోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. ఓవైపు ఈ సమ్మ‌ర్‌లో ఎండ వేడిమి ఇబ్బంది పెడితే, మ‌రో వైపు ఈ స‌మ‌యాన్ని సరిగ్గా ఉప‌యోగించుకుంటే భారీగా సంపాదించ‌వ‌చ్చు. అలాంటి ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. 

PREV
15
చిన్న బిజినెస్‌తో మంచి ఆదాయం

మరో వారం పది రోజుల్లో ఎండాకాలం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే నాలుగు నెలలు తీవ్రమైన వేసవి ఉండే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే చిన్న పెట్టుబడితో మంచి ఆదాయం సంపాదించే అవకాశం ల‌భిస్తుంది. అలాంటి సీజనల్ బిజినెస్‌లలో బాదం మిల్క్, మజ్జిగ, నిమ్మరసం వంటి కూల్ డ్రింక్స్ స్టాల్ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు.

25
వేసవిలో జ్యూస్ సెంటర్ ఎందుకు లాభదాయకం?

వేసవిలో ప్రజలు చల్లని పానీయాల కోసం ఎక్కువగా వెతుకుతారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, మార్కెట్ ప్రాంతాలు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే చోట్ల జ్యూస్ స్టాళ్లు ఎప్పుడూ బిజీగా ఉంటాయి. ఎండలో ప్రయాణం చేసినవారు, పనుల కోసం బయటికి వచ్చినవారు వెంటనే చల్లని పానీయం తాగాలని చూస్తారు. తక్కువ ధరలో లభిస్తే మరింత ఆదరణ ఉంటుంది. అందుకే ఈ బిజినెస్‌కు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.

35
ధరలు ఎలా ఉండాలి?

ఈ స్టాల్‌లో ప్రధానంగా అమ్మే పదార్థాలు:

బాదం మిల్క్ – గ్లాస్ రూ. 15

మజ్జిగ – గ్లాస్ రూ. 10

నిమ్మరసం – గ్లాస్ రూ. 10

ఈ ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకం చేసే విధానం ఇక్కడ ముఖ్యమైంది. రుచి, శుభ్రత బాగుంటే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు.

45
పెట్టుబడి ఎంత? అవసరమైన సామగ్రి ఏమిటి?

ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ముఖ్యంగా కావాల్సింది: జ్యూస్ నిల్వ ఉంచేందుకు ఒక ఫ్రీజర్, గ్లాసులు, బాదం, పాలు, చక్కెర, పెరుగు, ఉప్పు (మజ్జిగ కోసం), నిమ్మకాయలు, ఐస్ క్యూబ్స్, మంచి నీటి సదుపాయం. ఒక చిన్న స్టాల్ లేదా రోడ్డు పక్కన షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు. శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే కస్టమర్ల విశ్వాసం పెరుగుతుంది.

55
లాభం ఎంత వస్తుంది?

సగటున రోజుకు కనీసం 100 గ్లాసులు అమ్మగలిగితే సరిపోతుంది. ఉదాహరణకు రోజుకు 100 గ్లాసులు అమ్మితే రోజువారీ ఆదాయం సుమారు రూ. 1,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఖర్చులు తీసేసినా మంచి మార్జిన్ మిగులుతుంది. ఎండాకాలం నాలుగు నెలలు ఉంటుంది. ఈ నాలుగు నెలల్లో స్థిరంగా అమ్మకాలు జరిగితే మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. విద్యార్థులు, చిన్న వ్యాపారం చేయాలనుకునే వారు, అదనపు ఆదాయం కోరుకునే కుటుంబాలు ఈ బిజినెస్‌ను పరిశీలించవచ్చు. క‌రెక్ట్‌గా క్లిక్ అయితే ఈ వ్యాపారంతో ఒక్క స‌మ్మ‌ర్‌లోనే ల‌క్ష రూపాయ‌లు సంపాదించుకోవ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories