త్వరపడండి.. కియా కార్లపై రూ.లక్షల్లో డిస్కౌంట్

First Published | Nov 17, 2024, 10:19 AM IST

కియా మోటార్స్ వినియోగదారుల కోసం భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. కియా మోటార్స్ కు చెందిన సెల్టోస్, సోనెట్, కేరెన్స్ మోడల్స్ కు ఈ భారీ తగ్గింపులు లభిస్తాయి. కియా అందిస్తున్న మరిన్ని డిస్కౌంట్స్ వివరాలు తెలుసుకుందాం రండి. 

కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి పండుగ సీజన్‌లో కార్ల కంపెనీలు తగ్గింపులు ప్రకటించాయి. అయితే పాత స్టాక్ ఇంకా అమ్ముడుపోలేదు. దీంతో ఈ నెలలో కంపెనీలు మళ్ళీ మంచి తగ్గింపులు ఇస్తున్నాయి. ముఖ్యంగా  కియా మోటార్స్ తన మూడు ఫేమస్ కార్లపై రూ.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. ఈ తగ్గింపులు, ఆఫర్‌లు ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి. సెల్టోస్‌పై రూ.2 లక్షల వరకు, సోనెట్‌పై రూ.55,000 వరకు, కేరెన్స్‌పై రూ.95,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు ఉందో చూద్దాం. కియా సెల్టోస్ కంపెనీ మిడ్-సైజ్ SUV సెల్టోస్‌ను 1 ఏప్రిల్ 2024న ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మోడల్ కారును ఈ నవంబర్‌లో కొనుగోలు చేస్తే మీరు రూ.2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.90 లక్షల నుండి రూ.20.45 లక్షల వరకు ఉంటుంది. కియా సెల్టోస్‌ను HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్  అనే 7 వేరియంట్‌లలో అందిస్తుంది. అయితే ఈ తగ్గింపులు ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి. 


సెల్టోస్ ఫీచర్లు చాలా బాగున్నాయి. కొనుగోలు చేసే ముందు సెల్టోస్ టెస్ట్ డ్రైవ్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ నెలలో కియా చౌకైన SUV సోనెట్‌పై మీరు రూ.55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ డీలర్షిప్ ద్వారా అందించబడుతుంది. కాబట్టి తగ్గింపు ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. 

కియా సోనెట్ బేస్ మోడల్ రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 34 రకాల వేరియంట్లు ఉన్నాయి. వాటిల్లో టాప్ ఎండ్ ధర రూ. 15.77 లక్షలు ఉంటుంది. సోనెట్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఫీచర్లు కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సోనెట్‌పై రూ.55,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

మీకు కియా కేరెన్స్ కొనాలనుకుంటే త్వరపడండి. ఎందుకంటే ఈ కొత్త, పాత స్టాక్‌పై డీలర్ స్థాయిలో రూ.52,000 నుండి రూ.95,000 వరకు తగ్గింపు లభిస్తుంది. కియా కేరెన్స్ ధర రూ. 10.52 లక్షల నుండి రూ. 19.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధర ఉంది. కియా క్యారెన్స్ 10 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి ప్రీమియం, ప్రీమియం(O), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్(O), ప్రెస్టీజ్ ప్లస్, ప్రెస్టీజ్ ప్లస్(O), లగ్జరీ, లగ్జరీ(O), లగ్జరీ ప్లస్, X-లైన్. కస్టమర్ అవసరాలను తీర్చడానికి ఇన్ని రకాల వేరియంట్‌లు సిద్ధం చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఎంపిక చేసిన మోడల్స్ కు మాత్రమే వర్తిస్తాయి. 

కేరెన్స్ 7 సీట్ల MPV. దీని ధర రూ.10.52 లక్షల నుండి రూ.19.94 లక్షల వరకు ఉంటుంది. కియా క్యారెన్స్ సేఫ్టీ కిట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ముందు. వెనుక పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ కెమెరా డాష్‌క్యామ్ ఉన్నాయి. ఇంతకుముందు ఈ MPV గ్లోబల్ NCAP పరీక్ష‌లో గెలిచి సేఫ్టీ సర్టిఫికేట్ దక్కించుకుంది. 

ఈ మూడు కార్లలో దేనినైనా కొనాలనుకుంటే కియా షోరూమ్‌ను సంప్రదించండి. ఈ ఆఫర్లు అన్నీ ఈ నెల వరకు లేదా స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి.

Latest Videos

click me!