కియా నుంచి మరో సూపర్ కార్: డిజైన్, ఫీచర్లు ఎంత బాగున్నాయో..

Published : Jan 26, 2025, 01:56 PM IST

కియా కంపెనీ నుంచి మరో కొత్త మోడల్ కారు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. కేరెన్స్ పేరుతో ఉన్న ఈ మోడల్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. డిజైన్ కూడా చాలా రిచ్ గా ఉంది. ఈ కారు విడుదల తేదీ, ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి. 

PREV
14
కియా నుంచి మరో సూపర్ కార్: డిజైన్, ఫీచర్లు ఎంత బాగున్నాయో..

కియా కంపెనీ కార్లు చాలా రిచ్ లుక్ తో ఉంటాయి. అలాంటి మరో స్టైలిష్ కారును లాంచ్ చేయడానికి కియా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ ఫేజ్ లో ఉంది. కేరెన్స్ పేరుతో ఉన్న ఈ కొత్త వెర్షన్ కారు ఈ సంవత్సరం చివర్లో వస్తుందని భావిస్తున్నారు. అయతే అధికారిక లాంచ్ తేదీని కంపెనీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. చిన్న డిజైన్ మార్పులు ఉండవచ్చని సమాచారం. ఇంటీరియర్‌ లో పెద్ద మార్పు ఉంటుంది. కానీ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉండవని చెబుతున్నారు.

24

కియా కేరెన్స్ ఇంటీరియర్

కొత్త కేరెన్స్ ఇంటీరియర్‌లో మార్పులు ఉండే అవకాశాలున్నాయి. కొత్త స్టీరింగ్ వీల్, ట్రిమ్స్, అప్‌హోల్‌స్టరీ ఉండవచ్చు. కియా సెల్టోస్ మాదిరిగానే 30-అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే కూడా అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 12.3-అంగుళాల HD టచ్‌స్క్రీన్, 12-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5-అంగుళాల ఆటోమేటిక్ AC కంట్రోల్ డిస్‌ప్లే ఈ కారులో ఏర్పాటు చేస్తున్నారు. 

34

కియా కేరెన్స్ భద్రతా ఫీచర్లు

ప్రయాణికుల భద్రతకు కియా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. భద్రతను పెంచడానికి కొత్త కేరెన్స్‌ మోడల్ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తో లెవెల్ 1 డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న ఫీచర్లు కొనసాగిస్తూనే 360-డిగ్రీల కెమెరా కూడా ఏర్పాటు చేస్తారట.

44

కేరెన్స్ ఎక్స్‌టీరియర్ & ఇంజిన్

ఈ ఏడాదిలోనే విడుదల కానున్న కేరెన్స్ మోడల్ లో కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌గ్రేడ్ చేసిన హెడ్‌లైట్లు, మార్చిన బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కొత్త కలర్ స్కీమ్‌లను కూడా అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ కూడా కొనసాగే అవకాశం ఉంది.

click me!

Recommended Stories