కావ్య తండ్రి కళానిధి మారన్ సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు. రాజకీయంగా కావ్య కుటుంబంలో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కావ్య తాత మురసోలి మారన్, మామ దయానిధి మారన్ ఇద్దరూ మాజీ కేంద్ర మంత్రులు.
కళానిధి మారన్‌కి కావ్య ఒక్కగానొక్క కూతురు. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం భారతీయ బిలియనీర్ల లిస్టులో కళానిధి మారన్ 82వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు దాదాపు 24,000 కోట్ల రూపాయలు. అతను టెలివిజన్ ఛానెల్స్, వార్తాపత్రికలు, వీకెండ్ పత్రికలు, సాటిలైట్ సేవలు, ప్రోడక్ట్ సర్వీసెస్ మొదలైన వివిధ రంగాలలో విజయవంతమైన బ్రాండ్‌లను నిర్మించారు. కళానిధి మారన్ 2010 నుండి 2015 వరకు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో భారీ వాటా ఉంది.