జియో టూ ఇన్ వన్ ఆఫర్ : ఒకే కనెక్షన్‌తో రెండు టీవీలు, 800+ ఛానల్స్, 13 ఓటిటి ప్లాట్ ఫామ్స్

First Published | Aug 20, 2024, 10:44 PM IST

వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ తీసుకువచ్చి సరికొత్త సేవలను అందిస్తుంటుంది రిలయన్స్ జియో. తాజాగా టూ ఇన్ వన్ అంటూ సరికొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది... ఏమిటీ ఆఫర్..?

Reliance Jio

Reliance Jio :  కేవలం ఒకే కనెక్షన్ తో రెండు టీవీలను రన్ చేయవచ్చు. ఒకే ప్లాన్ తో ఏకంగా 800 లకు పైగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ బాషల ఛానల్స్ వీక్షించవచ్చు. 13 ఓటిటి యాప్ లను ఉచితంగా పొందవచ్చు. ఇంత అద్భుతమైన ఆఫర్ ను అత్యంత తక్కువ ధరకే రిలయన్స్ జియో వినియోగదారులకు అందిస్తోంది.  
 

Reliance Jio

ఏమిటీ ప్లాన్ : 

రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ ను ఎయిర్ ఫైబర్ కనెక్షన్ కలిగిన వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. 'జియో టివిప్లస్ టూ ఇన్ వన్' పేరుతో అద్భు తమైన ఆఫర్ అందిస్తోంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లయితే కేవలం రూ.599, రూ.899 లేదా అంతకంటే ఎక్కువ, ప్రీపెయిడ్ వినియోగదారులయితే రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ లలో అందుబాటులో వుంది. 

ఈ టూ ఇన్ వన్ ప్లాన్ ద్వారా జియో టివి ప్లస్ యాప్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో 800కి పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్, 13 ప్రముఖ ఓటిటి యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. ఇలా జియో టివి ప్లస్ యాప్ ద్వారా అనేక రకాల కంటెంట్‌ను పొందవచ్చు.  10 భాషల్లో 20 కేటగిరీల 800 ఛానల్స్, ఒకే లాగిన్ నుండి 13 ఓటిటి ప్లాట్‌ఫారమ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. 
 


Reliance Jio

టూ ఇన్ వన్ ఆఫర్ లో ఆకట్టుకునే అంశం ఒకే కనెక్షన్‌తో రెండు టీవీలను రన్ చేయండి. అంటే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఈ ఆఫర్ ద్వారా రెండు టీవీల్లో నచ్చిన కంటెంట్ వీక్షించవచ్చన్న మాట. ఒకే కుటుంబంలో వేరువేరు రకాల కంటెంట్ చూసేవారికి ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగకరంగా వుంటుంది. 
 

Reliance Jio

జియో టివి ప్లస్ యాప్ ఇప్పుడున్న అన్ని స్మార్ట్ టీవీల్లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి సైన్ ఇన్ అయితే మొత్తం కంటెంట్ ను కావాల్సినంత వేగంతో చూడవచ్చు. ప్రస్తుతం ప్రసారమయ్యే షోలనే కాదు గతంలో ప్రసారమైన  షోలను కూడా క్యాచ్ అన్ టీవి ఫీచర్ ను ఉపయోగించి చూడవచ్చు. వ్యక్తిగత ఆసక్తిని బట్టి  ఛానల్స్, షోలు, సినిమాలను రికమండ్ చేస్తుంది.  ఇక పిల్లల కోసం కిడ్స్ సేఫ్ సెక్షన్ వుంది. 

Reliance Jio

ఈ జియో టివి ప్లస్ యాప్ ద్వారా ఎంటర్టైన్ మెంట్ తో పాటు న్యూస్, స్పోర్ట్స్, మ్యూజిక్, బిజినెస్, భక్తి వంటి అన్ని ఛానల్స్ చూడవచ్చు. పిల్లలు ఇష్టపడే పోగో, కార్టూన్ నెట్ వర్క్, డిస్కవరీ కిడ్స్ వంటి ఛానల్స్ కూడా అందుబాటులో వుంటాయి. 

టూ-ఇన్-వన్ ఆఫర్ ను పొందడానికి మీ స్మార్ట్ టీవీ యాప్ స్టోర్ నుండి జియో టివి ప్లస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. మీ రిజిస్టర్డ్ జియో ఫైబర్ లేదా జియో ఎయిన్ ఫైబర్ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేసి ఈ ఆఫర్ ద్వారా అందే సేవలను పొందవచ్చు. 

Latest Videos

click me!