ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. 50 వేలు మీదే..

First Published | Aug 20, 2024, 7:01 PM IST

ప్రస్తుతం ఎంత చిన్న అవసరమైనా.. ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. మరి ఒక్క ఆధార్‌ ఉంటే రూ.50 వేలు పొందొచ్చని మీకు తెలుసా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రండి..
 

సాధారణంగా ఏదైనా రుణం పొందడానికి KYC తప్పనిసరి. అంతేకాకుండా మీ బయో మెట్రిక్‌తో ఆధార్‌ కచ్చితంగా లింక్‌ అయి ఉండాలి. ఇలా  చేసుకున్న వారికి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఒక్క ఆధార్‌ లింక్‌ చేసుకుంటే పేస్లిప్పులు, ఇతర డాక్యుమెంట్లు అవసరం లేకుండానే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మరి.. ఆధార్‌ ఒక్కటి ఉంటే రూ.50 వేలు పర్సనల్‌ లోన్‌ ఎలా పొందాలో తెలుసుకుందాం. 
 

ఈ అర్హతలు తప్పనిసరి..
ఆధార్ కార్డ్ ద్వారా లోన్ పొందేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. వ్యక్తి తప్పనిసరిగా UIDAI జారీ చేసిన ప్రత్యేకమైన ఆధార్ కార్డ్‌ని కలిగి ఉండాలి.  20 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దరఖాస్తుదారుడు నెలకు కనీసం రూ.15,000 సంపాదిస్తూ ఉండాలి. సదరు వ్యక్తికి తప్పనిసరిగా 600 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉండాలి. వారు కనీసం ఒక సంవత్సరం పని చేయాలి.
 


అవసరమైన డాక్యుమెంట్స్‌ ఇవి..
ఆధార్ కార్డ్, ఇన్‌కం ప్రూఫ్‌, ఆదాయ ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు లేదా పే స్లిప్‌లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బర్త్‌ సర్టిఫికేట్‌, ఓటరు ID 
 

లోన్‌కు ఇలా అప్లై చేయండి..
మీరు దరఖాస్తు చేస్తున్న బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. మీ వ్యక్తిగత, క్రెడిట్ వివరాలను నమోదు చేయండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. వాటిని పరిశీలించిన బ్యాంకు అధికారులు అన్నీ సరిగా ఉంటే రుణం మంజూరు చేస్తారు. 
 

Latest Videos

click me!