Reliance JIO
రిలయన్స్ జియో... టెలికాం రంగంలో ఈ పేరు ఓ సంచలనం. భారతీయులందరికీ ఉచితంగానే అన్ లిమిటెడ్ కాలింగ్స్, ఇంటర్నెట్ డాటా, ఎస్ఎంఎస్ లను అందించి టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఇలా దేశవ్యాప్తంగా విస్తరించిన జియో నెట్ వర్క్ వినియోగదారులకు అత్యుత్తమ, అత్యాధునిక సేవలను అందిస్తోంది. దేశంలో మొదటిసారి 5G సేవలను ప్రారంభించి ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికింది జియో.
Reliance JIO
అయితే ఇటీవల ఒక్కసారిగా జియో కుదుపుకు గురయ్యింది. రీచార్జ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది జియో... దీంతో ఇతర నెట్ వర్క్ లోకి జంప్ అయి వినియోగదారులు కూడా రిటర్న్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ లోకి లక్షలాదిమంది జియో వినియోగదారులు చేరారు...మరికొందరు ఇతర నెట్ వర్క్స్ లోకి మారారు. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన జియో జాగ్రత్త చర్యలు చేపట్టింది. పెంచిన రీచార్జ్ ధరలను కొనసాగిస్తూనే వినియోగదారులను నిలుపుకునే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కొత్తగా రీచార్జ్ ప్లాన్స్ ని తీసుకువచ్చింది.
Reliance JIO
రూ.75 రీచార్జ్ తో 23 రోజుల వ్యాలిడిటీ ప్లాన్..:
జియో రీచార్జ్ ధరలు అమాంతం పెంచేసాక ఏ ప్లాన్ చూసినా రూ.200 పైనే వున్నాయి. వందల నుండి వేల రూపాయల్లోపై అన్ని రీచార్జ్ ప్లాన్స్ వున్నాయి. అలాంటిది కేవలం రూ.75 రూపాయల రీచార్జ్ ప్లాన్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..!! కానీ మీరు విన్నది నిజమే. జియోలో 75 రూపాయలతో అన్ లిమిటెడ్ కాలింగ్స్, ఎస్ఎంఎస్ తో పాటు డాటాను అందించే ప్లాన్ వుంది.
Reliance JIO
కేవలం 75 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే చాలు... 23 రోజులపాటు అన్ లిమిటెడ్ కాలింగ్స్, 50 ఎస్ఎంఎస్ లతో పాటు ఇంటర్నెట్ డాటా లభిస్తుంది. రోజుకు 100ఎంబి చొప్పున 23 రోజులకు 2.5 జిబి డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 200ఎంబి డేటాను కూడా బోనస్ గా పొందవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ తో జియో టివి, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
Reliance JIO
అయితే ఈ ప్లాన్ జియో వినియోగదారులందరికీ కాదు... కేవలం జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా వాడేవారికి కూడా ఈ ప్లాన్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. కేవలం అన్ లిమిటెడ్ కాలింగ్ కోరుకునేవారికి ఈ జియో ప్లాన్ చాలాబాగా ఉపయోగపడుతుంది.