Recharge: ఆ ప్లాన్‌ మళ్లీ వచ్చేసింది.. 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 28రోజుల వ్యాలిడిటీతో

Narender Vaitla | Published : Feb 2, 2025 5:56 PM
Google News Follow Us

జియో కొత్త ఆఫర్ ప్రకటించింది. గత కొన్ని నెలలుగా నిలిపివేసిన ఈ ఆఫర్ మళ్ళీ కొత్త రూపంలో లాంచ్ అయింది. ఈసారి అన్‌లిమిటెడ్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ, 2GB డేటా, జియో టీవీతో సహా మరికొన్ని అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

16
Recharge: ఆ ప్లాన్‌ మళ్లీ వచ్చేసింది.. 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 28రోజుల వ్యాలిడిటీతో

దేశంలో టెలికం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ ను భారీగా పెంచిన నేపథ్యంలో ట్రాయ్ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో అన్ని ప్రముఖ ప్రైవేట్ టెలికం సంస్తలు టారిఫ్ లను తగ్గించాయి. ఈ నేపథ్యంలోనే జియో చాలా రోజులుగా నిలిపివేసిన రూ. 189 రూపాయల ప్లాన్ ను మళ్లీ తీసుకొచ్చింది. 

26

ఈసారి జియో 189 రూపాయల రీఛార్జ్ ప్లాన్ అనేక ప్రత్యేక బెనిఫిట్స్ అందిస్తోంది. దీంతో యూజర్లు ఒక నెల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్స్, SMSలు వంటి అనేక ఆఫర్‌లను అందిస్తున్నారు. ఈ తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అందిస్తున్నారు.

36

ట్రాయ్ ఆదేశాల మేరకు వాయిస్, SMS ప్లాన్‌లను అన్ని టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. ఇందులో జియో ముందు వరుసలో ఉంటోంది. కొత్త ప్లాన్ ద్వారా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 189 రూపాయల ప్లాన్ కింద ఏ సదుపాయాలు వినియోగదారులకు లభిస్తాయి.  

Related Articles

46

189 రూపాయల జియో రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్..

28 రోజుల వ్యాలిడిటీ

* అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్

* 300 SMSలు ఉచితం

* 2GB హైస్పీడ్ డేటా (ముగిసిన తర్వాత వేగం 64Kbpsకి తగ్గుతుంది)

* జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్

56

ప్రస్తుతం జియో అందిస్తున్న చవకైన రీఛార్జ్ ప్లాన్‌లలో 189 రూపాయల ప్లాన్ కూడా ఉంది. దీనితో పాటు జియో ఇతర రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తోంది. ఈ కోవలోకే వస్తుంది రూ. 199 ప్లాన్. 

66

జియో 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కింద ప్రతిరోజూ 1.5GB డేటా ఉచితంగా లభిస్తుంది. డేటాను ఎక్కువగా ఉపయోగించే వారికి ఇది చక్కని ప్లాన్. ఇంకా ప్రతిరోజూ 100 SMSలతో పాటు ఇతర సాధారణ ఆఫర్‌లు కూడా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో కేవలం 18 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. 

Recommended Photos