బీఎస్ఎన్ఎల్ అందించే సూపర్ రీఛార్జ్ ప్లాన్ ఏంటో తెలుసా? బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 12 నెలలు. ఈ ప్లాన్ ద్వారా అన్ని లోకల్, STD కాల్స్ ను సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ గా ఫ్రీగా చేయొచ్చు.
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు మొత్తం 600 GB డేటా లభిస్తుంది. దీనికి రోజువారీ డేటా లిమిట్ లేదు. అందువల్ల మీరు ఈ డేటాను ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. లేదా ఏడాది పొడవునా ఉపయోగించవచ్చు. అదనంగా ఈ ప్లాన్ రోజుకు 100 ఉచిత SMSలను అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేయకుండా ఉండాలనుకునే వారికి రూ.1,999 ప్లాన్ చాలా బెస్ట్ ప్లాన్.