Fact check: మీరు ఊహించనంత తక్కువ ధరకు జియో ఎలక్ట్రిక్ స్కూటర్

First Published | Dec 4, 2024, 10:55 AM IST

మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పెట్రోల్ వెహికల్స్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించేవారు పెరుగుతున్నారు. టూ వీలర్ కంపెనీలు కూడా మార్కెట్ లో పోటీని తట్టుకోవడానికి ఈవీ లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అతి తక్కువ ధరకు ముఖేష్ అంబానీ జియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నారు అంటూ పలు వార్తలు వచ్చాయి. వాటిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం. 

రిలయన్స్ కంపెనీ అడుగుపెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. పెట్రోల్ బంకులతో మొదలై టెలికాం నెట్ వర్క్, కిరాణా మాల్స్, భూగర్భ గ్యాస్, ఎలక్ట్రానిక్స్, ఫోన్స్, ఇలా అనేక విభాగాల్లో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్లోకి కూడా రిలయన్స్ జియో పేరుతో అడుగుపెడుతోంది. త్వరలోనే తన కంపెనీ మొదటి స్కూటర్ ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ స్కూటర్ ఫీచర్స్, ధర తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంత తక్కువ ధరకు అసలు స్కూటర్ ఎలా అమ్ముతారని అనుకుంటారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.  

జియో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవల మార్కెట్ కి పరిచయం చేసింది. అయితే వినియోగదారులు చేతికి వచ్చే సరికి కొంత సమయం పడుతుంది. సుమారు 2025లో ఈ స్కూటర్ లాంచ్ అవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్ ధర, ఫీచర్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ వంటి అనేక వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్కూటర్ చాలా ఆధునిక సాంకేతికత ఉపయోగించి తయారు చేశారు. 

రేంజ్

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన మోటారుతో వస్తుంది. దీని లిథియం-అయాన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 నుండి 100 కి.మీ వరకు ప్రయాణించగలదు.


ధర

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.14,999 నుండి రూ.17,000 వరకు ఉంటుందని అంచనా. ఇంత తక్కువ ధరకు మార్కెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం లేదు.  ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర. ఈ స్కూటర్ యువతకు, మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ వాడేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. 

ఆన్‌లైన్ బుకింగ్

ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ తర్వాత కొనుగోలుదారులకు ఒక నంబర్ ఇస్తారు. దాన్ని తీసుకొని దగ్గర్లోని జియో స్టోర్ నుండి స్కూటర్‌ను డెలివరీ తీసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో స్కూటర్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది. కాని డెలివరీ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగదారుల చేతికి అందవచ్చని తెలుస్తోంది. 

Fact check

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన వివరాలపై ఏసియా నెట్ జియోను సంప్రదించగా అది అవాస్తవమని తేలింది. తాము ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేయడం లేదని స్పష్టం చేశారు. 

Latest Videos

click me!