490 మిలియన్ల వినియోగదారులతో, రిలయన్స్ జియో దేశంలోనే అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్‌గా కొనసాగుతోంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ప్లాన్స్ ను తీసుకొస్తోంది కాబట్టే జియోకు ఆదరణ పెరుడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తమ యూజర్ల కోసం మంచి రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.
ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం జియో ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా అందేలా ఈ ప్లాన్ ను పరిచయం చేశారు. ఇంతకీ ఈ ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే ఎంతతో రీఛార్జ్ చేసుకోవాలి.? ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 899తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. బెనిఫిట్స్ విషయానికొస్తే 90 రోజుల పాటు యూజర్లు అన్ లిమిటెడ్ కాల్స్ పొందుతారు. మూడు నెలల పాటు రీఛార్జ్ చేయాలనే టెన్షన్ ఉండదు.
ఎక్కువ డేటా కావాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే ట్రూ 5జీ సేవలను అందిస్తోంది. 90 రోజులకు 180 జీబీ డేటా లభిస్తుంది. అదే విధంగా అదనంగా 20 జీబీ డేటాతో కలిపి మొత్తం 200 జీబీ డేటా పొందొచ్చు.
ఇక ఈ రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఓటీటీ సేవలు కూడా ఉచితం పొందొచ్చు. ఇందులో భాగంగా జియో సినిమాతో పాటు జియో క్లౌడ్, జియో టీవీ వంటి ఓటీటీ యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించారు.