Jio Recharge Plan: కేవలం రూ.26కే 28 రోజుల వరకు డేటా వాడుకోవచ్చు.. జియో ప్లాన్ అదిరిపోయిందిగా..

Published : Apr 20, 2025, 08:00 AM IST

Jio Recharge Plan: రిలయన్స్ జియో అద్భుతమైన డేటా రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవలం 26 రూపాయలకే ఏకంగా 28 రోజుల వరకు డేటా ఉపయోగించుకొనే వెసులుబాటును కలిగిస్తోంది. ఇంత తక్కువ ఖర్చుతో ఇంత మంచి వ్యాలిడిటీతో కూడిన డేటా ప్లాన్ ను పోటీ కంపెనీలు కూడా అందించలేకపోతున్నాయి. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

PREV
14
Jio Recharge Plan: కేవలం రూ.26కే 28 రోజుల వరకు డేటా వాడుకోవచ్చు.. జియో ప్లాన్ అదిరిపోయిందిగా..

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. అందులో ఎక్కువ వ్యాలిడిటీ, తక్కువ ఖర్చుతో ఉండే ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పోటీ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్-ఐడియా తదితర కంపెనీలకు పోటీగా ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తోంది. 

పోటీ కంపెనీలు ఇవ్వని ఓ సూపర్ రీఛార్జ్ ప్లాన్ ని జియో అందిస్తోంది. ఇది కేవలం రూ.26కే ఏకంగా 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. 

24

జియో 26 ప్లాన్ వివరాలు

రిలయన్స్ జియో 26 రూపాయల ప్లాన్‌లో వినియోగదారులకు 2GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది డేటా ప్లాన్. ఇదే ధరతో పోటీ కంపీలైన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్-ఐడియా కూడా డేటా ప్లాన్స్ అందిస్తున్నాయి. కాని జియో ఇచ్చేంత వ్యాలిడిటీ ఇవ్వడం లేదు. ఈ రీఛార్జ్ ప్లాన్ లో ఇదే ప్రత్యేకత. 

34

జియో 26 ప్లాన్ వ్యాలిడిటీ

డేటా రీఛార్జ్ ప్లాన్స్ లో 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే చౌకైన ప్లాన్ రిలయన్స్ జియో మాత్రమే అందిస్తోంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా 26 రూపాయల చౌకైన ప్లాన్‌ను కలిగి ఉన్నాయి. కానీ ఈ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీని అందించవు. 

మీరు ఈ ప్లాన్ రీఛార్జ్ చేయించుకోవాలనుకుంటే రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ Jio.com, My Jio యాప్ రెండింటిలోనూ చేసుకోవచ్చు. 

44

ఈ ప్లాన్ ఎవరు రీఛార్జ్ చేసుకోవచ్చు

జియోఫోన్ వినియోగదారులు మాత్రమే ఈ అతి తక్కువ డేటా రీఛార్జ్ ప్లాన్ ని ఉపయోగించుకోగలరు. మీరు కూడా జియో ఫోన్‌ను ఉపయోగిస్తుంటే మీ బేస్ ప్లాన్‌లో లభించే డేటా అయిపోతే ఈ డేటా ప్యాక్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎయిర్‌టెల్, VI ప్లాన్‌లు ఒక రోజు మాత్రమే..

26 రూపాయల డేటా ప్లాన్ ను ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా కూడా ఇస్తున్నాయి. కాని అవి 1.5GB హైస్పీడ్ డేటాతో కేవలం 1 రోజు మాత్రమే వ్యాలిడిటీని అందిస్తున్నాయి. కానీ రిలయన్స్ జియో ఏకంగా 28 రోజుల వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాయి. 

ఇది కూడా  చదవండి ఐఫోన్ కంటే ఆ కీప్యాడ్ ఫోనే అత్యంత ఖరీదైంది. ఎందుకంటే..?

Read more Photos on
click me!

Recommended Stories