ఆహా.. ఇకపై ఇన్‌స్టాలో ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చూడొచ్చు.. కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలంటే..

Published : Apr 19, 2025, 08:20 PM IST

Instagrams New Blend Feature: ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ‘బ్లెండ్’ అనే ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు మీ ఫ్రెండ్స్‌తో కలిసి మీకు నచ్చిన రీల్స్ చూడొచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టాయిష్టాలను బట్టి రీల్స్ సెలెక్ట్ చేసి ఇన్‌స్టా మీకు చూపిస్తుంది. గ్రూప్ చాట్‌లో కూడా ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. 

PREV
14
ఆహా.. ఇకపై ఇన్‌స్టాలో ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చూడొచ్చు.. కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలంటే..

మనలో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ షేర్ చేసే అలవాటు ఉంటుంది కదా.. ఎవరికి నచ్చిన రీల్స్ వారి ఫ్రెండ్స్ కి రోజూ పంపిస్తూనే ఉంటాం. దీంతో చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. ప్రతి రీల్ షేర్ చేస్తున్నారేమిట్రా అని చిరాకు పడుతుంటాం. ఇకపై ఇలాంటి అవస్థలు లేకుండా ఇన్‌స్టాగ్రామ్  కొత్తగా ‘బ్లెండ్’ అనే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రత్యేకతలేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

24

సోషల్ మీడియాలో కొత్త కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ‘బ్లెండ్’ అనే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ బ్లెండ్ ఫీచర్ లో మీరు మీకు నచ్చిన ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. దీంతో మీరంతా ఒక గ్రూప్ లా ఏర్పడతారు. గ్రూప్ లో చేరిన వారికి నచ్చిన వీడియోలను ఇన్ స్టాగ్రామ్ చూపిస్తుంది. 

34

ఇన్‌స్టాగ్రామ్ ‘బ్లెండ్’ ఫీచర్ స్పెషాలిటీ ఏంటంటే.. మీరు, మీ ఫ్రెండ్స్ ఇష్టపడే రీల్స్ ఒకే చోట చూడొచ్చు. 

బ్లెండ్‌ని స్టార్ట్ చేయడానికి మీరు చాట్ ఓపెన్ చేసి, బ్లెండ్ సింబల్ క్లిక్ చేయాలి.

ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకోవాలి. 

బ్లెండ్‌లో జాయిన్ అయ్యాక, మీ అందరి ఇష్టాలను బట్టి రీల్స్ కనిపిస్తాయి. 

వాటిని క్లిక్ చేయడం ద్వారా మీ గ్రూప్ లో ఉన్న వారంతా ఒకేసారి రీల్స్ చూడొచ్చు. 

44

మీ గ్రూప్‌లో ఉన్న ఎవరైనా వీడియోకి లైక్, కామెంట్ చేస్తే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈజీగా చాట్ కూడా చేసుకోవచ్చు. 

బ్లెండ్ నుంచి బయటకు రావాలంటే మెసెంజర్ ఐకాన్ క్లిక్ చేసి, చాట్ సెలెక్ట్ చేసి, ‘Leave this Blend’ క్లిక్ చేయాలి. 

ఇన్‌స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చిన ఈ బ్లెండ్ ఫీచర్ ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చూడటాన్ని సరదాగా మారుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories