జియో సూపర్ ప్లాన్ ... కేవలం 175 రూపాయలకే డాటాతో కూడిన 12 ఓటిటి ప్లాట్ ఫామ్స్...

First Published | Aug 12, 2024, 5:22 PM IST

రీచార్జ్ ప్లాన్స్ ధరల పెంపుతో ఇప్పటికే రిలయన్స్ జియో లక్షలాదిమంది కస్టమర్లను కోల్సోయింది. మిగతా కస్టమర్లు కూడా ఇదే బాటలో నడవకుండా సంతృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తోంది జియో. ఇందులో భాగంగానే రూ.200 కంటే తక్కువతో ఓ సరికొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది జియో

Jio


Reliance Jio : ఇటీవల అంబానీల ఇంట పెళ్లి వేడుక ఎంతగా వార్తల్లో నిలిచిందో ఇటీవల రిలయన్స్ జియో రీచార్జ్ ప్లాన్స్ ధరలు ఒక్కసారిగా పెంచడంకూడా అదే స్థాయిలో సంచలనంగా మారింది. ఈ రెండు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపారంపై పెద్దగానే ప్రభావం చూపించాయి. 

Jio

 అయితే అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్ళి రిలయన్స్ వ్యాపారాలపై పాజిటివ్ ప్రభావం చూపితే ఆ వెంటనే ఈ జియో ప్లాన్స్ ధరల పెంపు  ప్రజల్లోకి చాలా నెగెటివ్ గా వెళ్ళింది. ఫ్రీ అంటూ జియోను మార్కెట్ లోకి వదిలిన రిలయన్స్ ఇప్పుడు వినియోగదారులపై భారీగా భారం మోపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. "మీ ఇంట పెళ్లికోసం చేసిన ఖర్చులు మావద్ద వసూలు చేస్తున్నారా ముఖేష్ అంబానీగారు' అంటూ నెటిజన్లు  సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. దీన్నిబట్టే జియో రీచార్జ్ ప్లాన్స్ పెంపుపై వినియోగదారులు ఎంత గరంగరంగా వున్నారో అర్థమవుతోంది. వీరిని కూల్ చేసేందుకు రిలయన్స్ సరికొత్త ప్లాన్స్ తో ముందుకు వస్తోంది. అందులో ఒకటే జియో రూ.175 రీచార్జ్. 


Jio

రిలయన్స్ జియో వినియోగదారులు రీచార్జ్ ప్లాన్స్ ధరల పెంపును మరిచేలా ఓ అద్భుతమైన రీచార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది జియో. కేవలం 175 రూపాయల రీచార్జ్ తో అపరిమిత వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ రీచార్జ్ తో హైస్పీడ్ డాటాతో ఏకంగా 12 ఓటిటి యాప్స్ యాక్సెస్ అందిస్తోంది జియో. 

Jio

కేవలం వినోదం మాత్రమే కోరుకునే జియో వినియోగదారులు ఈ రూ.175 రీచార్జ్ ప్లాన్ బాగా సరిపోతుంది. ఈ ప్లాన్ లో 10జిబి హైస్పీడ్ డాటాతో పాటు 12 ఓటిటి ప్లాట్ ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందవచ్చు. 28 రోజులకు వ్యాలిడిటీని కలిగివుంటుంది. డాటా వినియోగానికి రోజువారి పరిమితి లేదు...  28 రోజుల వరకు ఎప్పుడు, ఎంతయినా వాడుకోవచ్చు.  

Jio

175 రూపాయల రీచార్జ్ ప్లాన్ తో జియో సినిమా ప్రీమియతో పాటు సోనీ లివ్, జీ5, డిస్కవరీ+,సన్ నెక్స్ట్ వంటి ఓటిటి సేవలను ఉచితంగా పొందవచ్చు.  అలాగే  ప్రాంతీయ బాషలకు చెందిన ప్లానెట్ మరాఠీ, చౌపాల్,డోకుబే, ఎపిక్ ఆన్ వంటి  ఓటిటి సేవలను కూడా పొందవచ్చు. మొత్తంగా ఈ ప్లాన్ ద్వారా 10జిబి డాటా, 12 ఓటిటి ప్లాట్ ఫామ్ సేవలను ఫ్రీగా పొందవచ్చు. 
 

Jio

అయితే ఈ 175 ప్లాన్ కేవలం డాటాకే పరిమితం...  ఎలాంటి  వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లభించవు. ఇవి పొందాలంటే  ఇతర ప్లాన్ రీచార్జ్ యాక్టివ్ గా వుండాలి. కేవలం ఎంటర్టైన్ మెంట్  కోసమే ఈ రూ175 రీచార్జ్ ఉపయోగపడుతుంది. 

Latest Videos

click me!