డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా..? బెస్ట్ ట్రిక్స్ మీకోసమే..!

First Published | Aug 12, 2024, 12:43 PM IST

ఎంత సంపాదించినా.. ఇంట్లో డబ్బులు ఉండటం లేదు.. ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలీడం లేదు అని చాలా మంది అనుకుంట ఉంటారు. అందుకే.. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకొని ఉండాలి.

డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు. కానీ...ఆ సంపాదించిన డబ్బును మాత్రం ఆదా చేయలేకపోతున్నారు. సడెన్ గా ఏదైనా అవసరం వస్తే.. చేతిలో రుపాయి ఉండటం లేదు. డబ్బు ఆదా చేయకపోవడం పక్కన పెడితే.. అవసరానికి డబ్బులు మళ్లీ అప్పులు చేస్తున్నవారు పెరిగిపోతున్నారని చెప్పొచ్చు. మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారా..? అయితే.. అదనపు ఖర్చులకు పులిస్టాప్ పెట్టి.. డబ్బు ఆదా చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

1.ఈ రోజుల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా మందికి చాలా కష్టంగా మారుతుందని చెప్పొచ్చు. ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి.. ఎంత సంపాదించినా.. ఇంట్లో డబ్బులు ఉండటం లేదు.. ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలీడం లేదు అని చాలా మంది అనుకుంట ఉంటారు. అందుకే.. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకొని ఉండాలి.


2.మనకు వచ్చే జీతం ఎంత.. మనం ఎంత ఖర్చు చేస్తున్నాం..? దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనే జాబితాను ఏ నెలకు ఆ నెల కచ్చితంగా రాసుకోవాలి. దానికి తగినట్లు మనం బడ్జెట్ తయారు చేసుకోవాలి.
 

3.మీరు బడ్జెట్ క్రియేట్ చేసుకోవడం వల్ల.. దేనికి ఎంత ఖర్చు పెడతున్నారు..? అవసరాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు.? అనవసరపు ఖర్చులు ఏమేమి ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. దానిని బట్టి.. అనవసరపు ఖర్చులను కట్ చేస్తూ ఉండాలి. అప్పుడు చాలా వరకు డబ్బులు మీకు చేతిలో కనపడతాయి.
 

4.మీ ఖర్చులకు తగినట్లు మీ ఆదాయాన్ని డివైడ్ చేసుకోవాలి.  అంటే.. ఇంటి రెంట్, ఫుడ్, ట్రావెల్ ఖర్చులకు దేనికి ఎంత అనేది ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు.. మన సంపాదనంతా ఎటు పోతుంది అనే  ఒక ఐడియా వస్తుంది.
 

5.ఏదైనా వస్తువు కొనే ముందు.. దానితో మనకు అవసరం ఎంత ఉంది అనే విషయం గురించి ఆలోచించాలి. అది లేకపోతే కష్టం అనుకుంటే తప్ప  దానిని కొనకూడదు. అవసరం కాదు.. లగ్జరీ అనుకుంటే.. వాయిదా వేడయడమే మంచిది. ఇలా చేయడం వల్ల.. చాలా వరకు డబ్బులు మిగులుతాయి.
 

6. ప్రస్తుతం అన్నీ ఆన్ లైన్ ట్రాన్సక్షన్సే జరుగుతున్నాయి. దీని వల్ల లెక్క అనేది లేకుండానే.. డబ్బులు అకౌంట్ లో ఖాళీ అయిపోతున్నాయి. అలా కాకుండా.. చేతిలో క్యాష్ పెట్టుకొని ఖర్చులు చేయండి. దీని వల్ల.. ఒక్క లెక్క తెలుస్తుంది. డబ్బు ఆదా చేయడం కూడా అలవాటు అవుతుంది.
 

Latest Videos

click me!