ITR Filing
ఉద్యోగులు, వ్యాపారులకు డెడ్‌లైన్ వచ్చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసేందుకు నేడే (నవంబర్ 15) లాస్ట్ డేట్. ఇవాళ మిస్ అయ్యారంటే.. ఫైన్‌తో ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది మరి...
అనివార్య కారణాల వల్ల నవంబరు 15వ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైతే.. డిసెంబరు 31 2024 వరకు అవకాశం ఉంది. అయితే, నవంబర్ 15 తర్వాత ఆలస్యంగా ఐటీ రిటర్న్ (ఐటీఆర్ లేట్ ఫైలింగ్)ను సమర్పించడాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Last date for ITR Filing
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ఇ-ఫైలింగ్ 2024 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. అయితే, వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు గడువులను సంబంధిత శాఖ నిర్దేశించింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను (ITR) దాఖలు చేయడానికి గడువు మొదటి సెప్టెంబర్ 30 - 2024గా నిర్ణయించారు. అయితే, అది అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత అక్టోబర్ 31వరకు పొడిగించారు. మరోసారి ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించి... నవంబర్ 15వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ). పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సమర్పించే ముందు క్షుణ్ణంగా ఆడిట్ చేయడానికి తగిన సమయాన్నిచ్చింది.
November 15 deadline
నవంబర్ 15లోగా ఎవరెవరు ఐటీఆర్ ఫైల్ చేయాలి?
ఇప్పటికే పలుమార్లు ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించిన సీబీడీటీ.. నవంబర్ 15వ తేదీనే చివరి అవకాశమిచ్చింది. ఏదైనా కార్పొరేట్ సంస్థ, ఆదాయపు పన్ను చట్టం లేదా ఏదైనా ఇతర వర్తించే చట్టం ప్రకారం ఆడిట్ చేయాల్సిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు, ఆదాయపు పన్ను చట్టం లేదా మరేదైనా ఆర్థిక రికార్డుల ప్రకారం ఆడిట్ చేయాల్సిన సంస్థకు చెందిన భాగస్వామి వర్తించే చట్టం, లేదా సెక్షన్ 5A (పోర్చుగీస్ సివిల్ ద్వారా నిర్వహించబడే జీవిత భాగస్వాముల మధ్య ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించి) వర్తించే వారందరూ లేదా సంస్థలు ఈ గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి.
ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్
ఆదాయపు పన్ను ఆడిట్‌కు లోబడి ఉన్న పన్ను చెల్లింపుదారు తప్పనిసరిగా ఆడిట్‌కు సంబంధించిన నిర్దిష్ట వివరాలను వారి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో తప్పనిసరిగా అందించాలి. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సమర్పించిన తేదీ, రసీదు సంఖ్య తప్పనిసరిగా పొందుపర్చాలి. ఈ వివరాలను నమోదు చేయకుండా ITR ఫైలింగ్ పూర్తికాదు. అందువల్ల, పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి ముందు ఈ వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
deadline for submitting the income tax audit report
ఐటీఆర్ ఫైలింగ్ కంటే ముందు గడువులోగా ఆదాయపు పన్ను ఆడిట్ నివేదిక (ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్)ను తప్పనిసరిగా సమర్పించాలి. అలా చేయకపోతే రెండు చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లే ఐటీ శాఖ పరిగణిస్తుంది. ఒకటి ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం, రెండోది పన్ను ఆడిట్ నివేదికను సమర్పించకపోవడం. నవంబరు 15వ తేదీలోగా ఇది పూర్తవకపోతే సెక్షన్ 271 (బి) ప్రకారం జరిమానాతో పాటు బకాయి పన్ను మొత్తాలపై వడ్డీతో సహా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
Penalty For Delayed ITR Filing
నవంబర్ 15 గడువు దాటితే..
పన్ను చెల్లింపుదారులు నవంబర్ 15, 2024లోగా ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే.. డిసెంబర్ 31వ తేదీలోగా డిలేడ్ రిటర్న్ ఫైలింగ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అప్పుడు మీరు ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్న కారణంగా సెక్షన్ 234ఏ, 234బీ కింద వడ్డీ ఛార్జీలు, పలు రకాల జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. సెక్షన్ 234ఎఫ్ కింద ఆదాయ స్థాయిని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
ట్యాక్స్ ఆడిట్ రిపోర్టును గడువులోగా సమర్పించకపోతే రూ.లక్షన్నర వరకు జరిమానా లేదా మొత్తం అమ్మకాల్లో 0.5 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.