ఆపిల్ కంపెనీ అద్భుతమైన ఐఫోన్ 16 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గత సంవత్సరం రిలీజ్ చేసిన 15 సిరీస్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ ఐఫోన్ 16 మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ఫీచర్స్ వినియోగదారులను చాలా ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్‌ను మీరు కొనాలనుకొనుకుంటే వాటి కామన్ ఫీచర్స్, మోడల్స్ మధ్య తేడాలు ఇతర విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆపిల్ ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ కామన్ ఫీచర్లు ఇవే..
ఆపరేటింగ్ సిస్టమ్..
ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో లేటెస్ట్ వర్షన్ iOS 18 అందుబాటులో ఉంటుంది. ఇది మెరుగైన పనితీరు, కొత్త ఫీచర్లు, ఆప్టిమైజేషన్ కలిగి ఉంటుంది. ఐఫోన్ 16 సిరీస్‌లోని ప్రధాన ఫ్యూజన్ లెన్స్ వేడిని తగ్గించడానికి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌ను కలిగి ఉంది.
చిప్‌సెట్..
అధునాతన 5 నానోమీటర్ టెక్నాలజీతో తయారు చేయబడిన A18 బయోనిక్ చిప్
ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో అమర్చారు. ఇది వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ లైఫ్, ఎఫిషియన్సీని అందిస్తుంది.
డిస్‌ప్లే..
ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఈ మోడల్స్ అన్నీ OLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది సూపర్ రెటినా XDR టెక్నాలజీతో గొప్ప రంగులు, హై కాంట్రాస్ట్ రేషియో, డీప్ బ్లాక్స్‌ను అందిస్తుంది.
కెమెరా సిస్టమ్..
ఐఫోన్ అన్ని మోడల్స్‌లోనూ ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలిగిన కెమెరా సిస్టమ్ ఉంది. అయితే ఐఫోన్ 16, 16 ప్లస్‌లో కూడా మంచి నైట్ ఫోటోగ్రఫీని అందించే ఫీచర్లు ఉన్నాయి.
5G కనెక్టివిటీ..
ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఫోన్లన్నీ 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ తక్కువ లేటెన్సీతో మెరుగైన ఇంటర్నెట్ అనుభవం అందిస్తుంది. iPhone 16 సిరీస్‌లో 5G, WiFi 7, బ్లూటూత్ 5.3, థ్రెడ్ సపోర్ట్, అలాగే డ్యూయల్ SIM, NFC వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో,16 ప్రో మ్యాక్స్‌లు వేగవంతమైన డేటా బదిలీ కోసం USB 3ని కూడా కలిగి ఉన్నాయి. iPhone 16, 16 ప్లస్‌లు USB 2ని కలిగి ఉన్నాయి.
ఫేస్ ఐడీ..
అన్ని ఫోన్లలో కూడా సెక్యూరిటీ కోసం ఫేస్ ఐడీ ఉంటుంది. అన్ని మోడల్స్ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ను కలిగి ఉన్నాయి.
ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు..
బడ్జెట్ నిర్ణయించుకోండి..
ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ప్రీమియం ఫీచర్లతో వస్తాయి. కానీ ఎక్కువ ఖరీదైనవి. బడ్జెట్‌ను పరిశీలించి మీకు అవసరమైన ఫీచర్లతో సరిగ్గా సరిపోయే ఫోన్ ఎంపిక చేసుకోండి. iPhone 16 128GB, 256GB, 512GB వరుసగా రూ. 79,900, రూ. 89,900, రూ. 1,09,900 ధరకు లభిస్తాయి. అదే మెమరీ కాన్ఫిగరేషన్‌లలో లభించే iPhone 16 ప్లస్ ధర వరుసగా రూ. 89,900(128GB), రూ. 99,900(256GB), రూ.1,11,900 (512GB)లకు మార్కెట్‌లో దొరుకుతాయి. iPhone 16 Pro 128GB, 256GB, 512GB, 1TBలో వరుసగా రూ.1,19,900, రూ. 1,29,900, రూ. 1,49,900, రూ. 1,69,900 ధర పలుకుతున్నాయి. iPhone 16 Pro Max 256GBకి రూ. 1,44,900 నుండి ధర ప్రారంభమవుతుంది. అయితే 512GB, 1TB వేరియంట్‌ల ధర రూ. 1,64,900, రూ. 1,84,900గా ఉంది. అవి సెప్టెంబర్ 20, 2024 నుండి అమ్మకానికి వస్తాయని ఆపిల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
స్టోరేజ్ ఎంపికలు..
ఐఫోన్‌లు విభిన్న స్టోరేజ్ ఆప్షన్లతో వస్తాయి. 128GB, 256GB, 512GB, 1TB స్టోరేజ్ కెపాసిటీతో మోడల్స్ ఉన్నాయి. మీ యూసేజ్‌కు తగ్గట్టుగా సరైన స్టోరేజ్ ఎంపిక చేసుకోవడం మంచిది.
నెట్‌వర్క్ కనెక్టివిటీ..
మీరు వాడే 5G లేదా 4G నెట్‌వర్క్ సపోర్ట్ చేసే ఫోన్ కావాలి. మీ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఫోన్లు కవరేజి ఏరియాలో పనిచేస్తాయో లేదో అన్నది ముందు తెలుసుకోండి.
కెమెరా అవసరాలు..
కెమెరా ఫీచర్లు ఎక్కువగా ఉపయోగించే వారికి ఐఫోన్ ప్రో, ప్రో మ్యాక్స్ కెమెరా సిస్టమ్ మంచి ఎంపిక. అలాంటి ఫీచర్లు అవసరం లేనివారు రెగ్యులర్ ఐఫోన్ 16 లేదా 16 ప్లస్ తీసుకోవచ్చు.
యాక్సెసరీస్ కొనుగోలు..
ఐఫోన్ 16 సిరీస్‌లో అదనపు యాక్ససరీస్ వేయాలనుకుంటే మాగ్‌సేఫ్ ఛార్జర్‌లు, ఇతర యాక్సెసరీస్ కోసం అదనపు ఖర్చు ఉంటుందని మర్చిపోవద్దు. ఈ ఫోన్లలో ఛార్జర్ ఉండకపోవచ్చు.
వారంటీ, ఇన్సూరెన్స్..
ఆపిల్ ఐఫోన్ కు ఏదైనా రిపేర్ వస్తే చాలా ఖర్చు అవుతుంది. ఫోన్ కొనుగోలు సమయంలో అపిల్ కేర్ లేదా ఇంకో మంచి ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.
డిస్కౌంట్ ఆఫర్లు..
మీరు ఐఫోన్ కొనాలనుకుంటే ముందుగా మీరు ఎంచుకున్న ఫోన్ కు సంబంధించి సోషల్ మీడియాలో రివ్యూలు చదవండి. ఇతర వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవడం మంచిది. అంతేకాకుండా అఫిషియల్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్లు పరిశీలించడం ద్వారా మీరు తక్కువ ధరకు ఐఫోన్ కొనుక్కోవచ్చు.