హ్యాకర్ల నుంచి మీ డాటాను కాపాడుకోవాలంటే ఇలా చేయండి

First Published Sep 11, 2024, 4:04 PM IST

మీ ఫోన్‌ మెమొరీ ఫుల్‌ అయిపోతోందా? వాట్సాప్‌లో మీకు తెలియకుండానే ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్‌ అయిపోతున్నాయా?  మీ ఫోన్‌ ఐపీ అడ్రస్‌ హ్యాకర్స్‌కి తెలియకుండా ఉండాలా? అయితే మీరు ఈ టెక్నిక్స్‌ ఫాలో అవ్వాలి. 

వాట్సాప్‌కు కుప్పలు కుప్పలుగా ఫొటోలు, వీడియోలు వస్తుంటాయి. వాటిని మనం చూసిన తర్వాత ఏమయ్యాయని పెద్దగా పట్టించుకోం. అలాగే మనం కూడా చాలా మందికి ఫొటోలు, వీడియోలు పంపిస్తుంటాం. ఇవన్నీ వాట్సాప్‌ ఇంటర్‌నల్‌ మెమొరీలో స్టోర్‌ అయిపోతాయి. దీనివల్ల రిపీటెడ్‌ ఫొటోలు, వీడియోలు మెమొరీలో ఉండిపోతాయి. దీంతో స్టోరేజ్‌ ఫుల్‌ అయిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్‌ను మీరు మార్చుకోవాలి. 

ముందుగా వాట్సాప్‌ సెట్టింగ్‌ ఓపెన్‌ చేయాలి
తర్వాత స్టోరేజ్‌ మీద క్లిక్‌ చేయండి
మేనేజ్‌ స్టోరేజ్‌ను ఓపెన్‌ చేయండి
ఇక్కడ ఏఏ చాట్‌ ఎంత స్టోరేజ్‌ తీసుకుంటోందో తెలుస్తుంది.
మీకు అవసరం లేని చాట్‌ స్టోరేజ్‌ను డిలీట్‌ చేసేస్తే మెమొరీ సేవ్‌ అవుతుంది.

Latest Videos


వాట్సాప్‌లో మనకు చాలా మంది రోజూ ఎన్నో ఫొటోలు, వీడియోలు పంపిస్తుంటారు కదా. అవన్నీ మీరు క్లిక్‌ చేయకుండానే డౌన్‌లోడ్‌ లేదా సేవ్‌ అయిపోతున్నాయా? ఇలా అవడం వల్ల మీ మెమొరీ చాలా త్వరగా నిండిపోతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌ ఇతరులు ఎలాంటి ఫొటోలు, వీడియోలు పంపారో కూడా మీరు సరిగ్గా తెలుసుకోలేకపోవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే వాట్సాప్‌లో ఈ సెట్టింగ్స్‌ మార్చుకోవాలి. 

వాట్సాప్‌ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి
తర్వాత చాట్స్‌ పై క్లిక్‌ చేయండి
కనిపిస్తున్న ఆప్షన్స్‌లో మీడియా విజిబులిటీని ఆఫ్‌ చేయండి
దీని వల్ల గ్రూప్స్‌, చాట్‌లో వచ్చే ఫొటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా సేవ్‌ కావడం, డౌన్‌లోడ్‌ అవ్వడం ఆగిపోతాయి. 

మన ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్‌ను హ్యాక్‌ చేయడమే పనిగా కొందరు హ్యాకర్లు పనిచేస్తుంటారు. వాళ్లు చేసేది ఏంటంటే మన దగ్గర దొంగిలించిన డాటాను అడ్వర్టైజింగ్‌ కంపెనీలకు అమ్ముకుంటారు. దీనికి వారు రూ.లక్షలు, రూ.కోట్లలో డబ్బులు తీసుకుంటారు. హ్యాకర్ల వల్ల మన ప్రైవసీ దెబ్బతింటుంది. పర్సనల్‌ డాటా అంతా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలా జరగకుండా, మీ ఫోన్‌ భద్రంగా ఉండాలంటే ఈ విధంగా చేయండి. 

సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి
ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్‌ చేయండి
అందులో అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి
తర్వాత పొటెక్ట్‌ ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌, డిసేబుల్‌ లింక్‌ ప్రివ్యూస్‌ ఈ 2 ఆప్షన్స్‌ కనిపిస్తాయి. 
ఆ రెండింటినీ ఆన్‌ చేయండి
ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌ ఐపీ అడ్రస్‌ను ఎవరూ హ్యాక్‌ చేయలేదు. అంతేకాకుండా మాల్వేర్‌ లాంటి వైరస్‌ను కూడా మీ ఫోన్‌లోకి పంపలేరు. 

click me!