టాటా కార్ల పై భారీ డిస్కౌంట్లు: రూ.3 లక్షల వరకు తగ్గింపు

First Published | Sep 11, 2024, 1:14 PM IST

Tata Motors cuts prices : టాటా మోటార్స్ తన 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' ఆఫర్ కింద కార్ల ధరలపై భారీ తగ్గింపులను ప్రకటించింది. టాటా కార్లపై దాదాపు రూ.3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 10 న తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ఫోలియో ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన టాటా కంపెనీ, ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. 

Tata Motors' 'Festival of Cars' Discount Sale

టాటా మోటార్స్ 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' పేరుతో భారీ డిస్కౌంట్ సేల్‌ను ప్రారంభించింది. భారతదేశంలో రాబోయే పండుగ సీజన్‌కు ముందు టాటా ఈ డిస్కౌంట్ సేల్‌ను ప్రారంభించింది. కొత్త టాటా కార్ల పై దాదాపు రూ.3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో పాటు ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. 

ఈ ఆఫర్‌లు అక్టోబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. ఫెస్టివల్ ఆఫ్ కార్స్‌లో పెట్రోల్, డీజిల్, CNGతో సహా అన్ని రకాల కార్లపై తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. టియాగో, టిగోర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ వంటి ప్రముఖ కార్లను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

టాటా మోటార్స్ 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' డిస్కౌంట్ సేల్‌

ఎంచుకున్న మోడల్, వేరియంట్‌ను బట్టి తగ్గింపులు మారుతాయి. టాటా మోటార్స్ వారి "ఫెస్టివల్ ఆఫ్ కార్స్" ఈవెంట్‌లో భాగంగా అత్యంత ప్రజాదరణ పొందిన EV మోడళ్లపై కూడా గణనీయమైన ధరలను తగ్గించింది. డబ్బు ఆదాను కోరుకునే వారి కోసం, ICE మోడల్‌లను ఆశ్రయించే సగటు భారతీయ వినియోగదారుకు ఇది మరింత అందుబాటులోకి వస్తుందని టాటా పేర్కొంది.

ఆటోమొబైల్ సంస్థ టాటా టియాగో ధరను రూ. 40,000, టాటా పంచ్ రూ. 1.2 లక్షల వరకు, టాటా నెక్సాన్ ధర రూ. 3 లక్షల వరకు తగ్గించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ ధరల తగ్గింపులు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను 'మెయిన్ స్ట్రీమింగ్' చేయడంలో సహాయపడుతుందనీ, స్వీకరణను వేగవంతం చేస్తుందని వాహన తయారీదారు టాటా పేర్కొంది. 


టాటా మోటార్స్ 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' డిస్కౌంట్ సేల్‌

ధరల తగ్గింపులను అనుసరించి టాటా పంచ్ EV ఇప్పుడు రూ. 7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ప్రముఖ Nexon EV రూ. 12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుందని టాటా గ్రూప్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్‌తో ICE మోడల్‌లతో సమానంగా అత్యధికంగా అమ్ముడవుతున్న Nexon.ev ధరలను పరిమిత కాలం పాటు తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. "అదనంగా, Punch.ev, Tiago.evలలో పండుగ ఆఫర్‌లు కూడా వాటి ధరలను వారి ICE ప్రతిరూపాలకు దగ్గరగా తీసుకువచ్చాయని" ప్రకటించింది. 

Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరతో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లతో పోల్చదగినదని కంపెనీ పేర్కొంది. ఈ ధర ₹3 లక్షల వరకు పొదుపును సూచిస్తుంది. టాటా టియాగో ఇప్పుడు రూ.4.99 లక్షలకు లభిస్తోంది, వేరియంట్‌ను బట్టి రూ.65,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. టాటా టిగోర్ రూ.30,000 తగ్గింపుతో రూ.5.99 లక్షలకు, ఆల్ట్రోజ్ రూ.45,000 తగ్గింపుతో రూ.6.49 లక్షలకు లభిస్తోంది. నెక్సాన్ కారును ఇప్పుడు రూ.80,000 వరకు తగ్గింపుతో రూ.7.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

Tata Motors' 'Festival of Cars' Discount Sale

టాటా మోటార్స్ సఫారీ, హారియర్ వంటి పెద్ద మోడళ్లపై కూడా తగ్గింపును అందిస్తోంది. ఇటీవల విడుదలైన హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్‌కు పోటీగా ఉన్న టాటా సఫారీ రూ.15.49 లక్షల నుంచి ప్రారంభ ధరకే అమ్మకానికి ఉంది. దీనిపై రూ.1.8 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మరోవైపు, హారియర్ రూ.1.6 లక్షల తగ్గింపుతో రూ.14.99 లక్షలకు లభిస్తోంది. 

టాటా మోటార్స్ కస్టమర్‌లు రూ.45,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా అనేక అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే, ఈ అదనపు ప్రయోజనాలు ఎంపిక చేసిన షోరూమ్‌లలో మాత్రమే అందించబడతాయి. టాటా 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' గురించి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శ్రీ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ““ICE వాహనాలపై రూ.2.05 లక్షల వరకు ప్రయోజనాలతో, ఈ సంవత్సరం పండుగ వేడుకల్లో పరిమిత కాల ఆకర్షణీయమైన ధర తగ్గింపులు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్, నగదు ప్రయోజనాలు ఉన్నాయని" తెలిపారు.

Tata Motors' 'Festival of Cars' Discount Sale

కంపెనీ తన Tata Curvv EVని ఆగస్టులో రూ. 17.5 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించగా, ఈ నెల ప్రారంభంలో ప్రారంభించిన ICE వేరియంట్‌లు రూ. 9.99 లక్షలతో ప్రారంభ ధరతో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 9న, ఆటోమేకర్ "ఫెస్టివల్ ఆఫ్ కార్స్" ప్రచారంలో భాగంగా దాని ICE వేరియంట్ కార్లు, SVUలపై రూ. 2.05 లక్షల వరకు తగ్గింపులను ప్రకటించింది. దీని కింద టాటా టియాగోపై రూ.65000, టిగోర్‌పై రూ.30000,  హారియర్‌పై రూ.1,60,000 తగ్గింపును ప్రకటించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ప్రకటనలో పేర్కొంది. కారు/SUV- కొత్త ఎంట్రీ ధర-ధర తగ్గింపు  ఇలా ఉన్నాయి:

టియాగో- రూ. 4,99,900- రూ. 65,000

టిగోర్- రూ. 5,99,900- రూ. 30,000

ఆల్ట్రోజ్- రూ. 6,49,900- రూ. 45,000

నెక్సాన్- రూ. 7,99,990- రూ. 80,000

హారియర్- రూ. 14,99,000- రూ. 1,60,000

సఫారీ- రూ. 15,49,000- రూ. 1,80,000

Latest Videos

click me!