ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుత ఆఫర్లు

Published : Aug 22, 2024, 09:03 PM ISTUpdated : Aug 22, 2024, 09:06 PM IST

ఆపిల్ ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆ సంస్థ ఐఫోన్ 15 (iPhone 15) పై ఫ్లిప్‌కార్ట్ (Flipkart) భారీ తగ్గింపును ప్రకటించింది.

PREV
16
ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ పై  భారీ తగ్గింపు..  ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుత ఆఫర్లు
iPhone 15 Price Drop: Grab Huge Discounts on Flipkart Before iPhone 16 Launch

ఆపిల్ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్ లో విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటోంది. కొత్త  సిరీస్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఐఫోన్ 15 సిరీస్ మొబైళ్లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది.

26
iPhone 15 Price Drop: Grab Huge Discounts on Flipkart Before iPhone 16 Launch

ఐఫోన్ 16 మోడళ్ల కోసం అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, త్వరలోనే విడుదల కార్యక్రమం జరుగుతుందని భావిస్తున్నారు. ఈలోగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 మొబైళ్లపై ఆగస్టు 26 వరకు గణనీయమైన తగ్గింపు ఆఫర్లు తీసుకువచ్చింది. 

36
iPhone 15 Price Drop: Grab Huge Discounts on Flipkart Before iPhone 16 Launch

​​ఐఫోన్ 15 - 128జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,999కి లభిస్తోంది. ఇది ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.79,600కి అందుబాటులో ఉంది. అంటే  ఫ్లిప్‌కార్ట్‌లో  లో మీకు రూ.14,601 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఇతర వేరియంట్లు, ఇతర సిరీస్ మోడల్స్ పై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. 

46
iPhone 15 Price Drop: Grab Huge Discounts on Flipkart Before iPhone 16 Launch

ఈ తక్షణ తగ్గింపుతో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత మొబైల్ ను ఎక్సేంజ్ చేసుకుని మరింత తగ్గింపుతో తీసుకోవచ్చు. మొబైల్ పనితీరు, ప్రస్తుత స్థితిని బట్టి ఎక్సేంజ్ ఆఫర్ లో రూ.42,100 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, అసలు ఎక్స్ఛేంజ్ విలువ ప్రకటనలలో పేర్కొన్న గరిష్ట మొత్తం మన పాత మొబైల్ మోడల్, పరిస్థితిని బట్టి ఉంటుంది.

56
iPhone 15 Price Drop: Grab Huge Discounts on Flipkart Before iPhone 16 Launch

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌పై ఇదే అతిపెద్ద తగ్గింపు అని చెప్పాలి. అయితే, దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లను అందించడం లేదు. కాబట్టి ఐఫోన్ 15 కొనాలనుకునేవారు వెంటనే ఆర్డర్ చేయవచ్చు. ఈ తగ్గింపు ముగిసేలోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరి. 

66
iPhone 15 Price Drop: Grab Huge Discounts on Flipkart Before iPhone 16 Launch

రాబోయే ఐఫోన్ 16 సిరీస్ విషయానికొస్తే, కొన్ని ముఖ్యమైన మార్పులను ఆశించవచ్చు. పెద్ద బ్యాటరీ, కొత్త చిప్‌సెట్, స్వల్పంగా మెరుగైన డిజైన్ మార్పులు ఉంటాయని సమాచారం. కొత్త మోడళ్ల ధర కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, బడ్జెట్ సమస్య లేనివారు ఐఫోన్ 16 కోసం కోసం వేచి ఉండవచ్చు. బడ్జెట్ తక్కువగా ఉంటే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ఆఫర్ తో ఐఫోన్ 15 సిరీస్ మోడల్ ను కొనుగోలు చేసుకోడం ఉత్తమం. 

click me!

Recommended Stories