గేమ్ ఛేంజర్.. మహీంద్రా XUV 3XO.. ఎందుకో తెలుసా?

First Published Aug 22, 2024, 12:11 AM IST

సబ్ కాంపాక్ట్ SUV విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను XUV 3XO క్రియేట్ చేసింది. కియా సోనెట్, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వేన్యూ వంటి వాటితో సమానమైన క్వాలటీస్ కలిగి ఉంది. XUV 3XO పోటీ ధర ₹7.49 లక్షల నుండి ప్రారంభమై 15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ రకాల్లో అందుబాటులో ఉంది. 

మహీంద్రా XUV 3XO

ఈ ఏడాది ఏప్రిల్ 29న మహీంద్రా XUV 3XO భారతీయ మార్కెట్లలో విడుదలైంది. సబ్ కాంపాక్ట్ SUV మార్కెట్‌లో ఒక స్టాండ్ క్రియేట్ చేసింది. 3XO హ్యుందాయ్ వేన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి వాహనాల మాదిరి కొలతలు కలిగి ఉంది. రూ. 7.49 లక్షల నుండి ప్రారంభమై రూ. 15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు సాధారణ ధరలతో, XUV 3XO పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మహీంద్రా XUV 3XO అందించే సదుపాయాలు పోటీ కంపెనీలు కూడా ఇవ్వలేకుండా ఉన్నాయి. ఈ కారు కొనుక్కోవాలంటే మీకు సహాయపడే కొన్ని అంశాలు క్రింద ఉన్నాయి.

డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్

1. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అనేది టెంపరేచర్ నియంత్రణ వ్యవస్థ. ఇది మహీంద్రా XUV 3XOలో మాత్రమే ఉంది. ఈ ఫీచర్ ఉన్న సెగ్మెంట్‌లో మరే ఇతర కార్లు లేవు. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఇది తరచుగా ఖరీదైన SUVలలో కనిపిస్తుంది. డ్రైవర్, ప్రయాణీకుడు ఇద్దరూ ప్రత్యేకంగా ఎయిర్ కండిషనింగ్ సెట్ చేసుకోవచ్చు. 

2. పనోరమిక్ సన్‌రూఫ్.. ఈ రోజుల్లో సన్‌రూఫ్ అందరికీ చాలా ఇష్టమైన ఫీచర్. అందుకే 3XOలో కూడా ఇది ఉంది. అయితే ఇతర వాటితో పోల్చితే మరింత అద్భుతంగా పనోరమిక్ సన్‌రూఫ్‌ ఉంటుంది.

Latest Videos


ADAS సాంకేతికత

3. ADAS సాంకేతికత.. మహీంద్రా XUV 3XO అనేక ఇతర వ్యవస్థలతో పాటు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, ఆటోమేటిక్ హై బీమ్ అసిస్ట్,  లేన్ మెయిన్‌టెయిన్ అసిస్ట్ వంటి అనేక సెల్ఫ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ టెక్నాలజీలతో అమర్చబడింది.

4. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అదనంగా ఆటో-హోల్డ్‌తో కూడిన ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్‌తో అమర్చబడి ఉంది. మహీంద్రా సరికొత్త సబ్ కాంపాక్ట్ SUV. బ్రేక్‌ను విడుదల చేయడానికి స్విచ్‌ను నొక్కడం లేదా పైకి లేపడం చేస్తే చాలు. ఆటో-హోల్డ్ ఎంపికతో డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రత్యేకించి Creta, Tucson వంటి ఖరీదైన SUVల్లో సాధారణంగా ఈ ఫీచర్స్ ఉంటాయి. అందువల్ల మహీంద్రా XUV 3XO గేమ్ ఛేంజర్ అయ్యింది.

click me!