iPhone 15 : రాఖీ పండుగ సందర్భంగా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఐఫోన్ 15 ను భారీ తగ్గింపులో అందుకునే అవకాశం వచ్చింది. రాఖీ పండుగ ముందు ఈ ప్రీమియం ఐఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశాన్ని పొందండి.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ల్లో iPhone ఎప్పుడూ బెస్ట్ ఆఫ్షన్. కానీ, దాని అధిక ధర కారణంగా చాలా మంది ఆఫర్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి ఈ రాఖీ పండుగ సందర్భంగా శుభవార్త. ఇప్పుడు iPhone 15ను గణనీయమైన తగ్గింపుతో కొనుగోలు చేసే అద్భుత అవకాశం. మీ ప్రియమైన వారికోసం విలువైన గిఫ్ట్ కోసం ఆలోచిస్తున్నారా? ఈ రాఖీ సెలబ్రేషన్‌ను iPhone తో మరింత ప్రత్యేకంగా మార్చుకోండి!
26
iPhone 15 పై అమెజాన్‌లో భారీ తగ్గింపు
అమెజాన్‌లో లక్షలాది మంది కస్టమర్‌లను ఆకట్టుకునే విధంగా ఐఫోన్ 15 ధర గణనీయంగా తగ్గించబడింది. ఐఫోన్ 15 కొనుగోలుపై మీరు వేల రూపాయలు ఆదా చేయవచ్చు. 2023లో విడుదలైన iPhone 15, అద్భుతమైన కెమెరా, అధిక పనితీరు గల చిప్‌సెట్ తో ఫోటోగ్రఫీ, మల్టీటాస్కింగ్ కోసం బెస్ట్ ఎంపిక. అందుబాటులో ఉన్న ఆఫర్‌లను ఇక్కడ చూడవచ్చు.
36
రూ.8,000కుపైగా డిస్కౌంట్, అదనంగా క్యాష్‌బ్యాక్!
ప్రస్తుతం iPhone 15 (128GB) మోడల్ అమెజాన్‌లో ₹69,900కి లిస్ట్ చేయబడి ఉంది. అయితే, 12% తగ్గింపు ద్వారా ఇది కేవలం ₹61,400కి లభిస్తోంది. అంటే.. ఒక్క ఆఫర్‌లోనే మీరు ₹8,500 వరకు ఆదా చేయవచ్చు. అంతేకాకుండా, బ్యాంక్ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లిస్తే ₹1,842 క్యాష్‌బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంది.
iPhone 15 కొనుగోలుపై అమెజాన్ భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి గరిష్ఠంగా ₹49,150 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ ₹15,000 అయితే, iPhone 15ను కేవలం రూ. 44,600 లకే పొందవచ్చు. అయితే, అసలు ఎక్స్ఛేంజ్ ధర అనేది మీ ఫోన్ పనితీరు, బ్రాండ్, మోడల్, భౌతిక స్థితిపై ఆధారపడి ఉంటుంది.
56
ఐఫోన్ 15 ఫీచర్స్
iPhone 15 మోడల్‌లో అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు గాజు వెనుక ప్యానెల్ డిజైన్ ఉపయోగించబడింది. దీని వల్ల ఫోన్ ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది.
ఇది ధూళి, నీటి రక్షణకు IP68 రేటింగ్ కలిగి ఉంది. అంటే సాధారణ నీటి స్ప్లాష్‌లు, కొంతమేర దూళి నుంచి రక్షణ అందుతుంది.