కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్ పతనం.. సెన్సెక్స్ 700 పాయింట్లు క్రాష్..

First Published Jan 21, 2022, 11:05 AM IST

నేడు ఈ చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాలతో  ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 550 పాయింట్లు నష్టపోయి 58,914 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 158 పడిపోయి 17,599 వద్ద ప్రారంభమయ్యాయి. 

షేర్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఈ క్షీణత మరింత పెరిగింది దీంతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 695 పాయింట్లు, నిఫ్టీ 197 పాయింట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  

వరుసగా మూడు రోజులు క్షీణత 
గత ట్రేడింగ్ రోజున వరుసగా మూడో రోజు భారీ క్షీణత చూసిన సెన్సెక్స్ చివరకు 634 పాయింట్ల నష్టంతో 59,464 వద్ద ముగిసింది. దీనితో పాటు నిఫ్టీ కూడా రెడ్ మార్క్‌లో ట్రేడింగ్ కొనసాగించింది. గురువారం ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 923 పాయింట్ల వరకు విచ్ఛిన్నమై 59,200 స్థాయికి చేరుకుంది. దీంతో నిఫ్టీ కూడా 248 పాయింట్లు పడిపోయి 17,689 స్థాయికి చేరుకుంది.  

నేడు స్మాల్‌, మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో భారీ నష్టాలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 461 పాయింట్లు నష్టపోయి 59,002 దగ్గర ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 17,639 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు మొదలలైన కొద్దిసేపటికే కోల్పోవడం మొదలైంది. కేవలం గంట వ్యవధిలోనే 650 పాయింట్లకు పైగా నష్టపోంది. దీంతో లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ సంపద ఆవిరైంది. నిఫ్టీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటల తర్వాత మరోసారి ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించినా కొద్దిక్షణాల్లోనే ముగిసింది. నేడు సాయంత్రం స్టాక్ మార్కెట్‌ ముగిసే సరికి ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తప్పవనే అంచనాలు నెలకొన్నాయి. బుధ, గురువారాల్లో దేశీ సూచీలు భారీగా నష్టపోవడంతో సుమారు 7 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది.  

click me!