Loan: 10 నిమిషాల్లో రూ. కోటి వరకు లోన్‌.. 9.8 శాతం వడ్డీకే. అది కూడా ఫోన్‌లోనే

Published : Apr 12, 2025, 01:30 PM IST

ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన మఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మీడియా, టెలికం, పెట్రోలియం, ఫైనాన్స్‌ ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. మార్కెట్‌ పోటీకి అనుగుణంగా సరికొత్త పంథాలో సాగుతూ మెజారిటీ మార్కెట్‌ను హస్తగతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జియో ఫైనాన్స్‌లో మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ ఆఫర్‌? దీంతో వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Loan: 10 నిమిషాల్లో రూ. కోటి వరకు లోన్‌.. 9.8 శాతం వడ్డీకే. అది కూడా ఫోన్‌లోనే

జియో ఫైనాన్ఫియల్‌ యూజర్లను ఆకర్షించే క్రమంలో కొత్త ఆర్థిక సేవలను ప్రారంభించింది. సాధారణంగా బంగారం లేదా భూమిని తాకట్టుగా పెట్టి రుణాలను అందిస్తుంటారు. అయితే తాజాగా మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఉన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టి తక్కువ సమయానికే లోన్ అందించనుంది. ప్రత్యేకత ఏంటంటే, ఈ సర్వీస్ పూర్తిగా డిజిటల్‌ ఆధారంగా పనిచేస్తుంది. జియో ఫైనాన్స్ యాప్‌ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే లోన్‌ పొందవచ్చు. ఎలాంటి పేపర్‌ వర్క్‌ అవసరం లేదు. 
 

24

ఎంత వరకు లోన్ తీసుకోవచ్చు?

జియో ఫైనాన్షియల్‌ తీసుకొచ్చిన ఈ కొత్త సేవతో రూ. 1 కోటి వరకు లోన్‌ పొందొచ్చు. ఇందుకుగాను వడ్డీ రేటు 9.99 శాతం నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఇది పూర్తిగా మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా తక్కువ రిస్క్‌ కస్టమర్ అయితే వారికి తక్కువ వడ్డీ, హై-రిస్క్ కస్టమర్లకు కొద్దిగా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 
 

34

ఈ లోన్ కోసం మీరు తాకట్టు పెట్టాల్సింది మీ డీమ్యాట్ ఖాతాలోని షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లే. డీమ్యాట్ అకౌంట్ అనేది మీ ఇన్వెస్ట్‌మెంట్లను భద్రంగా నిల్వ చేసుకునే ఖాతా. ఈ ఖాతాలో ఉన్న పెట్టుబడులను ఆధారంగా చేసుకుని జియో ఫైనాన్స్ తక్కువ సమయంలోనే లోన్‌ అందిస్తోంది. ఎలాంటి పేపర్‌ అవసరం లేకుండా పూర్తిగా డిజిటల్‌ ప్రాసెస్‌లో లోన్‌ అందిస్తారు. 
 

44
jio finance

ప్రీపెమెంట్‌ చాలర్జీలు లేవు. తీసుకున్న రుణాన్ని మూడు సంవత్సరాల వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పించారు. అత్యవసర సమయంలో రుణం కావాలనుకునే వారికి ఈ సేవ బాగా ఉపయోగపడుతుందని జియో చెబుతోంది. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే మోబైల్‌లో కొన్ని క్లిక్‌లతోనే పెద్ద మొత్తంలో లోన్ పొందవచ్చు. ఇలా మీ మ్యూచ్‌ ఫండ్లతో సులభంగా రుణం పొందవచ్చు. పూర్తి వివరాల కోసం జియో ఫైనాన్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 
 

Read more Photos on
click me!

Recommended Stories