Earthquake: భూకంపం వస్తే ఏం చేయాలి? చాట్ జీపీటీ ఏం చెప్పిందో తెలుసా?

Published : Apr 19, 2025, 05:18 PM IST

Earthquake Safety Tips: భూకంపం వస్తే అందరూ ప్రాణభయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు వచ్చేస్తారు. అయితే ఈ లోగానే ఇళ్లు నేలకూలి చాలా మంది చనిపోతుంటారు. మరి భూకంపం వచ్చినప్పుడు ఏం చేస్తే ప్రాణాలకు రక్షణ కలుగుతుంది? ఇదే ప్రశ్నను చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? ఆ సూచనలు తెలుసుకుందాం రండి.

PREV
15
Earthquake: భూకంపం వస్తే ఏం చేయాలి? చాట్ జీపీటీ ఏం చెప్పిందో తెలుసా?

భూమి కంపించందంటే పెద్ద పెద్ద భవనాలే నేలమట్టం అయిపోతాయి. ఇక అందులో ఉండే వారు ప్రాణాలతో బయట పడటం చాలా కష్టం. అయితే చాలా మంది ప్రాణ భయంతో పరుగులు పెట్టేస్తారు. ఆ సమయంలో శిథిలాలు మీద పడి ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే భయపడకుండా తెలివితేటలతో ప్రవర్తిస్తే భూకంప తీవ్రత నుంచి బయట పడవచ్చని చాట్ జీపీటీ చెబుతోంది. దానికి ఏం చేయాలో సూచనలు కూడా ఇచ్చింది. అవేంటంటే..  

 

25

భూకంపం వచ్చినప్పుడు ఇలా తప్పించుకోండి

  • భూకంపం వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంటే వెంటనే చేతులు, మోకాళ్లపై నేలపైకి వంగండి.
  • బలమైన టేబుల్ లేదా డెస్క్ కింద మీ తల, మెడను ఉంచి రక్షణ పొందండి. లేదా చేతులతో కవర్ చేసుకోండి. 
  • భూమి కంపించడం ఆగే వరకు అలాగే ఉండండి. 
  • కిటికీలు, అద్దాలు, పడిపోయే ఫర్నీచర్‌కు దూరంగా ఉండండి.
  • బయటకు పరిగెత్తకండి. వస్తువులు మీ మీద పడే ప్రమాదం ఉంటుంది. 
35

భూకంపం వచ్చినప్పుడు బయట ఉంటే..

  • భవనాలు, స్తంభాలు, చెట్లు, విద్యుత్తు తీగలకు దూరంగా ఖాళీ ప్రదేశానికి వెళ్లండి.
  • నేలపై వంగి, తల, మెడను రక్షించుకోండి.
  • ఒకవేళ మీరు వెహికల్ నడుపుతుంటే సేఫ్ ప్లేస్ లో కారు లేదా బైక్ పార్క్ చేయండి. 
  • వంతెనలు, ఫ్లైఓవర్లు, సొరంగాలకు దూరంగా పార్క్ చేయండి. 
  • కంపనం ఆగేవరకు వాహనంలోనే ఉండండి.
45

భూకంపం ఆగిపోయిన తర్వాత ఇలా చేయండి..

  • మీకు ఎక్కడైనా గాయాలు అయ్యాయేమో చెక్ చేసుకోండి.
  • మీతో ఉన్న వారికి కూడా ఏమైనా గాయాలు అయ్యాయేమో చెక్ చేయండి. 
  • మీరు దెబ్బతిన్న భవనంలో ఉంటే జాగ్రత్తగా బయటకు వెళ్లండి. లిఫ్ట్‌లను వాడకండి.
  • గ్యాస్ లేదా విద్యుత్ లీకేజీ ఉంటే వెంటనే ఆపండి.
  • రేడియో, మొబైల్ లేదా ఇంటర్నెట్ ద్వారా అత్యవసర ప్రకటనలు వినండి.
  • అత్యవసరమైతేనే ఫోన్ వాడండి.
  • ఎందుకంటే ఛార్జింగ్ ఇష్యూ ఉంటుంది. అత్యవసర కాల్స్ మాట్లాడండి. 
55

భూకంపం జరిగిన కొన్ని గంటలు లేదా రోజుల తరవాత ఏం చేయాలి..

  • మీరున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమని అధికారులు అంటే చేయడానికి సిద్ధంగా ఉండండి.
  • అవసరమైన వస్తువులు అంటే.. నీరు, ఆహారం, టార్చ్‌లైట్, మందులు, డాక్యుమెంట్లు, డబ్బు, పవర్ బ్యాంక్ ఇలాంటివి దగ్గర పెట్టుకోండి. 
  • అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి. 
  • పొరుగువారికి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయండి.
Read more Photos on
click me!

Recommended Stories