మొత్తం 3.2 బిలియన్ల రుణలు ఉన్నట్లు తెలిసింది అంటే సుమారు 22000 కోట్లు, అందులో అతను కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. అప్పుల నుండి బయటపడటానికి అతను తన ఇంటిని అమ్మినా, అతనికి 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే లభిస్తాయి.
undefined
అనిల్ అంబానీ ఇల్లు ముంబైలోని పాలి హిల్‌లో ఉంది. అతని బంగ్లా విలువ రూ.5000 కోట్లు అని చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటి. అనిల్ అంబానీ ఇల్లు 66 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 16 వేల చదరపు అడుగులలో నిర్మించచారు. బంగ్లాకు ది-సీ విండ్ అని పేరు కూడా పెట్టారు.
undefined
అంబానీ ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్ సహా అనేక ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంటి పై పైకప్పుపై హెలిప్యాడ్ కూడా నిర్మించారు. 17 అంతస్తుల ఈ ఇంటిలో అనిల్ అంబానీ, భార్య టీనా అంబానీ, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అనిల్, టీనా అంబానీలకు కళలు, చిత్రలేఖనాలు చాలా ఇష్టం. ఈ కారణంగా అతని బంగ్లాలో చాలా చిత్రాలను మీరు దర్శనమిస్తాయి.
undefined
అనిల్ అంబానీ విలాసవంతమైన శైలిలో జీవిస్తున్నప్పటికీ అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అతని కంపెనీలు చాలా బ్యాంకుల అధీనంలో ఉన్నాయి. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఎడిఎజి) మొత్తం అప్పు రూ .12 వేల కోట్లకు పైగా ఉందని తెలిసింది.
undefined
కొద్ది రోజుల క్రితం అనిల్ అంబానీ 'రిలయన్స్ సెంటర్' ప్రధాన కార్యాలయాన్ని యెస్ బ్యాంక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కార్యాలయం 21 వేల చదరపు అడుగుల విస్తర్ణంలో ఉంటుంది. దీని ఖరీదు సుమారు 2 వేల కోట్లు. అంతే కాకుండా దక్షిణ ముంబైలోని నాగిన్ మహల్ రెండు అంతస్తులను కూడా యెస్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది.
undefined
అనిల్ అంబానీ ఇప్పటికీ చాలా బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో అతను తన ఇంటిని విక్రయించినా అతనికి 5000 కోట్ల రూపాయలు మాత్రమే లభిస్తాయి.
undefined
అనిల్ అంబానీ సొంత అన్నయ్య ముఖేష్ అంబానీ నివసించే ఇల్లు కూడా భారతదేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు. అంబానీ ఇంటికి యాంటిలియా అని పేరు కూడా పెట్టారు. ఫోర్బ్స్ ప్రకారం దీని విలువ 6000 కోట్లు.
undefined