ఈ భవనం మొత్తం మీద 27 అంతస్తులుంటాయి. 173 మీటర్ల పొడవు, 6,070 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణం జరిగింది. ఇందులో 9 హైస్పీడ్ లిఫ్టులున్నాయి. సుమారు 3 హెలీప్యాడ్లు ఉన్నాయి. 50 సీట్లున్న మినీ థియేటర్ కూడా ఉంది. 49 బెడ్‌రూమ్‌లు, 168 పార్కింగ్ స్థలాలు, బాల్‌రూమ్ అద్భుతంగా నిర్మించారు. టెర్రస్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్, స్పా, హెల్త్ సెంటర్, దేవాలయం, స్నో రూమ్ లాంటి అత్యాధునికమైన సదుపాయాలు ఈ భవనంలో ఉన్నాయి.
ఈ భవనానికి పౌరాణిక స్పానిష్ ఫాంటమ్ ద్వీపం యాంటిలియా పేరు పెట్టారు. చికాగోలో ఉన్న US ఆర్కిటెక్చర్ సంస్థలు పెర్కిన్స్ & విల్ , లాస్ ఏంజిల్స్‌లోని హిర్ష్ బెడ్నర్ అసోసియేట్స్ ఈ భవనాన్ని రూపొందించాయి. ఈ ఇంటిలో 27 అంతస్తులు అదనపు-ఎత్తైన పైకప్పులు ఉన్నాయి. ఇందులో ఉన్నవి 27 అంతస్తులే అయినా ఈ భవనం ఎత్తుకు సమానంగా ఉన్న బిల్డింగ్ ల్లో సుమారు 60 అంతస్తులు ఉంటాయి. దీన్ని బట్టి ఒక్కో ఫ్లోర్ ఎంత ఎత్తుగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు.