బ్రిటీష్ ప్రభుత్వం నుండి దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ఆగస్టు 15, 1947 తర్వాత కూడా భారతీయ నోట్లపై కింగ్ జార్జ్ VI ఫోటో ఉంది. స్వాతంత్య్రం వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత 1949 లో, భారత ప్రభుత్వం తన మొదటి ఒక రూపాయి నోటును రూపొందించింది. దేశంలో మొదటి ఒక రూపాయి నోటుపై కింగ్ జార్జ్ ఫోటో స్థానంలో సార్నాథ్‌లోని అశోక స్తంభంలోని సింహాన్ని ఉంచారు. అయితే, ఆ నోటుపై మహాత్మా గాంధీ ఫోటోను ఉంచాలని భావించారు.