ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ ని 5-సంవత్సరాల పదవీకాలనికి తిరిగి నియమించాలని వాటాదారులు ఆమోదించిన తర్వాత అతనికి సంవత్సరానికి 79.75 కోట్లు జీతం చెల్లించాల్సి ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, 2020-21లో రూ.49.68 కోట్ల నుండి దాదాపు 43 శాతం పెరిగి 2021-22 ఆర్థిక సంవత్సరంలో అతనికి రూ.71 కోట్ల జీతం చెల్లించబడుతుంది.
2021-22లో సలీల్ పరేఖ్ జీతం: స్టాక్ ఆప్షన్‌ల ఎకౌంట్లో రూ.52.33 కోట్లు, రిటైర్‌మెంట్ బెనెఫిట్స్ రూ.38 లక్షలతో సహా రూ.5.69 కోట్ల ఫిక్సెడ్ పేమెంట్, వేతనంలో వేరియబుల్ పే రూ.12.62 కోట్లు కూడా ఉన్నాయి .