todays gold price:పెరగడమే తప్ప తగ్గేదే లే.. 10 గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా...

Ashok Kumar   | Asianet News
Published : May 26, 2022, 09:24 AM IST

 ప్రపంచ పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు గత వారం నుంచి హెచ్చుతగ్గులను చవిచూస్తున్నాయి. అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి భారీగా కొనుగోలు చేస్తున్నారు. 

PREV
15
todays gold price:పెరగడమే తప్ప తగ్గేదే లే.. 10 గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా...

బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్‌మార్క్‌లు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750. ఎక్కువ శాతం బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ 24 కంటే ఎక్కువ ఉండదు, క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది.

25

22 అండ్ 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా  
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయితే, 24 క్యారెట్లతో బంగారు ఆభరణాలు చేయలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తున్నారు.
 

35
Lucknow gold smuggling

నగరం          22 క్యారెట్ల బంగారం   24 క్యారెట్ల బంగారం
చెన్నై             రూ.48,370               రూ.52,770
ముంబై           రూ.47,900               రూ.52,250
ఢిల్లీ               రూ.47,900                రూ.52,250
కోల్‌కతా          రూ.47,900               రూ.52,250
బెంగళూరు     రూ.47,900               రూ.52,250
హైదరాబాద్    రూ.47,900               రూ.52,250

 

45

నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరుగుదలతో రూ.52,250కు చేరింది.  ఆర్నమెంటల్ గోల్డ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది.  బంగారం ధరలు పెరగం  వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. 

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా
అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి. బంగారం ధర 0.27 శాతం పెరిగాయి. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1851.2 డాలర్లకు చేరాయి. అలాగే వెండి ధర కూడా పెరిగింది. ఇది 0.28 శాతం పైకి చేరింది. వెండి ధర ఇప్పుడు 21.92 డాలర్ల వద్ద కదలాడుతోంది.
 

55

హైదరాబాద్‌లో 22 క్యారట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,900గా ఉంది. నిన్నటితో పోల్చితే పెరిగింది.  ఒక్క గ్రాము  22 క్యారట్ల బంగారం ధర రూ.4,790కి చేరింది.  24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం 10గ్రాముల ధర రూ.52,250 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే పెరిగింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రూ.5,225కి చేరింది.  ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,500గా ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories