2024 ఆర్థిక సంవత్సరానికి RIL రెండవ త్రైమాసిక నివేదికను ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు ఈ చేరికలు జరిగింది అలాగే కంపెనీ షేర్లు 1.8 శాతం పెరిగాయి. 32 ఏళ్ల కవలలు ఇషా, ఆకాష్‌లు రిలయన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 98 శాతానికి పైగా ఓట్లు సాధించగా, 28 ఏళ్ల అనంత్‌కు 92.75 శాతం ఓట్లు వచ్చాయి. లిస్టెడ్ కంపెనీలకు డైరెక్టర్లను నియమించడానికి లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి వాటాదారుల ఆమోదం అవసరం. దీని కోసం వాటాదారుల ద్వారా ఓటింగ్ కూడా జరుగుతుంది.
ముకేశ్ అంబానీ ఇప్పటికే తన వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన వివిధ బాధ్యతలను ముగ్గురు పిల్లలకు పంచారు. గత కొన్ని సంవత్సరాలుగా ముగ్గురు పిల్లలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రధాన వ్యాపారాలకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీ 46వ అన్యువల్ జనరల్ సమావేశంలో ముఖేష్ అంబానీ తన పిల్లలకు వివిధ వ్యాపారాల పంపకం గురించి సమాచారం ఇచ్చారు.
తన ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్ అండ్ అనంత్ అంబానీ సంస్థ వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారని ముకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, 66 ఏళ్ల ముకేశ్ అంబానీ RIL చీఫ్‌గా రాబోయే 5 సంవత్సరాలు Jio, రిటైల్ అండ్ కొత్త ఇంధన పరిశ్రమలను సమర్ధవంతంగా నిర్వహించడానికి తగిన మార్గదర్శకత్వం అందిస్తానని చెప్పారు.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుండి ఎంబీఏ పట్టా పొందిన ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్‌కు అధిపతిగా ఉన్నారు. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే వ్యాపార విస్తరణ దిశగా గణనీయమైన చర్యలు చేపట్టింది. వ్యాపారవేత్త అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌ను ఇషా వివాహం చేసుకుంది. ఇషా కవల సోదరుడు ఆకాష్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అధినేత. చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెన్యువబుల్ ఎనర్జీ రంగానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
రిలయన్స్ డైరెక్టర్ల బోర్డులో అనంత్ అంబానీ నియామకాన్ని ఆమోదించవద్దని ప్రాక్సీ సలహా సంస్థ IIAS వాటాదారులకు సూచించింది. అనంత్ వయస్సు, అనుభవం తక్కువగా ఉన్నాయని ఇది ఓటింగ్ నిబంధనలకు అనుగుణంగా లేదని IIASలు తెలిపారు. అనంత్ అంబానీ వయసు 30 ఏళ్ల లోపే, 10 ఏళ్ల అనుభవం కూడా లేదు. అందువల్ల, అతనికి ఓటు వేయవద్దని IIAS వాటాదారులకు సూచించింది. అయితే, ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ నియామకాన్ని ఏజెన్సీ ఆమోదించింది.